వరంగల్‌ ఆయుర్వేద కళాశాలలో ప్రవేశాలకు నో

ABN , First Publish Date - 2022-10-27T16:06:03+05:30 IST

వరంగల్‌ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో 2022-23కి గాను బీఏఎంఎస్‌ ప్రవేశాలకు ఎన్‌సీఐఎ్‌సఎం(నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌

వరంగల్‌ ఆయుర్వేద కళాశాలలో ప్రవేశాలకు నో
ప్రవేశాలకు నో

గిర్మాజిపేట (వరంగల్‌), అక్టోబరు 26 : వరంగల్‌ అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో 2022-23కి గాను బీఏఎంఎస్‌ ప్రవేశాలకు ఎన్‌సీఐఎ్‌సఎం(నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టం ఆఫ్‌ మెడిసిన్‌) అనుమతి నిరాకరించింది. కళాశాలలో బోధన, బోధనేతర సిబ్బంది కొరత, కళాశాలకు ప్రత్యేక వెబ్‌సైట్‌, వైద్యవిభాగాల కంప్యూటరీకరణ లేకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది. దేశంలోని సిద్ధ, ఆయుర్వేద, యునాని, హోమియో వైద్య కళాశాలల్లో ప్రవేశాలు ఎన్‌సీఐఎ్‌సఎం పరిధిలో జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఎన్‌సీఐఎ్‌సఎం బృందం గత నెలలో వరంగల్‌ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలను వర్చువల్‌గా తనిఖీ చేసింది. పలు లోపాలను గుర్తించి సరిదిద్దుకోవాలని, లేదంటే ప్రవేశాలను నిలిపివేస్తామని హెచ్చరించింది. దీనిపై అప్పీలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 8వ తేదీ వరకు అవకాశమిచ్చింది. కానీ, ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రవేశాలకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది. దీంతో వరంగల్‌ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఈ ఏడాది 63 సీట్లను కోల్పోయింది.

Updated Date - 2022-10-27T16:06:10+05:30 IST