Gujarat:తండ్రీ, కుమారుల మధ్య సవాల్...గుజరాత్ ఎన్నికల సిత్రం

ABN , First Publish Date - 2022-11-15T07:08:54+05:30 IST

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో తండ్రీ కొడుకుల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది...

Gujarat:తండ్రీ, కుమారుల మధ్య సవాల్...గుజరాత్ ఎన్నికల సిత్రం
Father Son Fight

అహ్మదాబాద్ (గుజరాత్): గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో తండ్రీ కొడుకుల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.భారతీయ ట్రైబల్ పార్టీ వ్యవస్థాపకుడు ఛోటు వాసవ తన కుమారుడు మహేష్‌పై పోటీ చేసేందుకు ఝగాడియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.(Father Son Fight)గుజరాత్ రాష్ట్రంలో(Gujarat)వరుసగా ఏడుసార్లు అసెంబ్లీలో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) రిజర్వ్‌డ్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఛోటు వాసవ ప్రస్థుతం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.ఝగాడియాలో పార్టీ అధికారిక అభ్యర్థిగా ఛోటూ వాసవ కుమారుడు బీటీపీ జాతీయ అధ్యక్షుడు మహేశ్ వాసవ ఎన్నికల బరిలోకి దిగారు. అధికార బీజేపీని ఎదుర్కోవడానికి మరెవరూ లేనందున తాను ఎన్నికల్లో పోరాడవలసి వస్తుందని సీనియర్ వాసవ చెప్పారు.డిసెంబర్ 1 ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ఛోటువాసవ విశ్వాసం వ్యక్తం చేశారు.

‘‘ఒక కుటుంబంలోని సభ్యులు నాలుగు స్థానాల నుంచి పోటీ చేయవచ్చు... దేశంలో లేదా గుజరాత్‌లో బీజేపీ గెలవదు. నేను విజయంపై పూర్తి ఆశతో ఉన్నాను’’ అని ఛోటు వాసవ వివరించారు.తన చివరి శ్వాస వరకు ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటానని ఛోటు వాసవ చెప్పారు.తన తండ్రికి వ్యతిరేకంగా పోటీ చేయడంపై ప్రశ్నించగా, నామినేషన్ ఫారమ్‌లు దాఖలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని మహేష్ వాసవ చెప్పారు.ఈ ఏడాది మే నెలలో ఛోటు వాసవ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)తో పొత్తు పెట్టుకుని, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి బరూచ్‌లో ఉమ్మడి ర్యాలీ నిర్వహించారు.అయితే బీటీపీ తర్వాత ఆప్ తో పొత్తు నుంచి వైదొలిగింది.

Updated Date - 2022-11-15T07:12:54+05:30 IST