Gujarat Election 2022: అసదుద్దీన్‌కు షాకిచ్చిన ముస్లిం యువకులు, హోరెత్తించిన మోదీ నినాదాలు

ABN , First Publish Date - 2022-11-14T16:59:41+05:30 IST

సూరత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం..

Gujarat Election 2022: అసదుద్దీన్‌కు షాకిచ్చిన ముస్లిం యువకులు, హోరెత్తించిన మోదీ నినాదాలు

సూరత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ, ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asadudding Owaisi) ప్రచారం సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి సూరత్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నప్పుడు ఊహించని విధంగా ముస్లిం యువకుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. దీంతో బిత్తరపోవడం ఒవైసీ వంతయింది.

ఒవైసీ తన ప్రసంగం ప్రారంభించేందుకు సిద్ధం కాగానే, పలువురు ముస్లిం యువకులు 'మోదీ మోదీ' అంటూ నినాదాలు చేశారు. ఒవైసీకి నల్లజెండాలు చూపిస్తూ... గో బ్యాక్...అంటూ నిరసనలు తెలిపారు. దీంతో స్టేజీపై నుంచే ఆయన కొద్ది నిమిషాలు చూస్తుండిపోయారు. ప్రతిసారి ముస్లిం కార్డు ఉపయోగించే ఒవైసీ ఈసారి మాత్రం దళిత కార్టును తన ప్రసంగంలో ఉపయోగించారు. ''ప్రధానమంత్రి దళిత, గిరిజన, ఓబీసీ వ్యతిరేకి. సమాజంలో అణచితవేతకు గురైన వర్గాల హక్కులను కాలరాసి అగ్రవర్ణాలకు వాటిని కట్టబెడుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్ పేరుతో 2019లో చట్టం రూపొందడానికి ముందు పార్లమెంటులో దానిని నేను బలంగా వ్యతిరేకించాను. ఇలాంటి చట్టం ద్వారా బాబాసాహెబ్ అంబేడ్కర్ కలలను ఛిన్నాభిన్నం చేశారు. ఇది ఆర్థికంగా బలహీన వర్గాలకు ఉద్దేశించినది కాదు. అగ్రవర్ణాల కోసం ఉద్దేశించినది. గుజరాత్‌లోని దళిత, ఆదివాసి, ఓబీసీ సోదరులే కాకుండా దేశంలోని అందరూ ఈ విషయాన్ని గ్రహించాలి'' అని ఒవైసీ తన ప్రసంగంలో అన్నారు.

Updated Date - 2022-11-14T17:24:31+05:30 IST