Home » Asaduddin Owaisi
ఆర్టికల్ 26 దేశ ప్రజలకు మతస్వేచ్ఛ ఉందని చెబుతోందని, మతపరమైన, స్వచ్ఛంద సేవా కార్యకలాపాల కోసం సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆ ఆర్టికల్ దేశ ప్రజలకు ఇచ్చిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.
అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. టీటీడీకి, వక్ఫ్ భూముల వ్యవహారానికి తేడా తెలియని అజ్ఞాని ఒవైసీ అని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును తీసుకొచ్చిందని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.
ఎన్డీయేకి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడదామని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, ఎన్సీపీ-ఎస్పీ చీఫ్ శరద్ పవార్కు తమ పార్టీ లేఖ రాసినట్టు ఒవైసీ తెలిపారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లేనని అన్నారు.
హర్యానాలో తమ ఓటమికి ఈవీఎంలను కాంగ్రెస్ తప్పుపట్టడంపై అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపణ తెలిపారు. ఈవీఎంలను తప్పుపట్టడం చాలా సులభమని, ఈవీఎంల వల్ల మీరు నెగ్గినప్పుడు మాట్లాడరని, ఓడిపోతే మాత్రం ఈవీఎంలను తప్పు పడుతుంటారని అన్నారు.
ఓవైసీ బ్రదర్స్కు(Owaisi Brothers) ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ ఓవైసీ కనుసన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందని ఆరోపించారు.
రాష్ట్రంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీకి నిబంధనలను సవరించాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని కోరారు.
‘‘హైడ్రా కూల్చివేతల విషయంలో ఒవైసీకి ఒక న్యాయం? ఇతరులకు మరో న్యాయమా? సకలం చెరువును ఆక్రమించిన ఒవైసీ విద్యా సంస్థలకు ఎందుకు నోటీసులివ్వరు?
సల్కం చెరువులో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కట్టిన అక్రమ భవనాలను కూల్చివేసే ధైర్యం ఉందా..? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలపై మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.