Heel Pain: మడమ నొప్పి తగ్గేదెలా?

ABN , First Publish Date - 2022-11-17T10:59:35+05:30 IST

నాకు రెండు వారాలుగా మడమ నొప్పి వేధిస్తోంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే పాదాన్ని నేల మీద పెట్టి నడవలేని పరిస్థితి. ఎన్ని చిట్కాలు పాటించినా ఫలితం ఉండడం లేదు. ఈ నొప్పి తగ్గే మార్గం లేదా?

Heel Pain: మడమ నొప్పి తగ్గేదెలా?
మడమ నొప్పి తగ్గేదెలా?

నాకు రెండు వారాలుగా మడమ నొప్పి వేధిస్తోంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే పాదాన్ని నేల మీద పెట్టి నడవలేని పరిస్థితి. ఎన్ని చిట్కాలు పాటించినా ఫలితం ఉండడం లేదు. ఈ నొప్పి తగ్గే మార్గం లేదా?

- కవిత, హైదరాబాద్‌.

లక్షణాలను బట్టి మీ సమస్య ప్లాంటార్‌ ఫాసియైుటిస్‌ అయి ఉంటుందని అనిపిస్తోంది. ప్రతి పది మందిలో ఒకరు ప్లాంటార్‌ ఫాసియైుటిస్‌ సమస్యతో బాధపడేవారే! ఈ సమస్య పురుషుల్లో కంటే స్త్రీలలోనే రెండింతలు ఎక్కువ. . అయితే ఎక్కువ సందర్భాల్లో ఈ నొప్పి ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే దానంతటదే సర్దుకుంటూ ఉంటుంది. కానీ అలా తగ్గిపోకుండా అంతకంతకూ పెరుగుతుంటే చికిత్స తీసుకోవాల్సిందే!

విశ్రాంతి:

ప్లాంటార్‌ ఫాసియా మీద ఒత్తిడి తగ్గితే నొప్పి తగ్గిపోతుంది. కాబట్టి పాదానికి రెస్ట్‌ ఇవ్వటం వల్ల ఈ నొప్పిని అదుపు చేయొచ్చు.

చెప్పులు మార్చాలి:

పాదంలోని ఒంపుకు సపోర్ట్‌ ఇచ్చే మెత్తని ఆర్థోపెడిక్‌ చెప్పులు ధరిస్తే చాలావరకూ నొప్పి తగ్గిపోతుంది. షూలో హీల్‌ ప్యాడ్స్‌ వాడటం అలవాటు చేసుకోవాలి.

స్ట్రెచింగ్‌:

పాదం అడుగున ఉండే ప్లాంటార్‌ ఫాసియాను వదులు చేయటం కోసం ఫిజియోథెరపిస్ట్‌ సహాయంతో తేలికపాటి స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజెస్‌ చేయాల్సి ఉంటుంది.

ఐస్‌ ప్యాక్‌:

ఐస్‌ క్యూబ్స్‌తో నొప్పి ఉన్నచోట ప్యాక్‌ వేయటం వల్ల నొప్పి అదుపులోకొస్తుంది.

పెయిన్‌ కిల్లర్స్‌:

నొప్పి అదుపు చేయటం కోసం కొంతకాలంపాటు పెయిన్‌ కిల్లర్స్‌ వాడక తప్పదు.

నైట్‌ స్ల్పింట్స్‌:

ప్లాంటార్‌ ఫాసియా స్ట్రెచ్‌ అయ్యేందుకు రాత్రి పూట పాదానికి స్ప్లింట్స్‌ ధరించాలి. దీని వల్ల ఉపశమనం ఉంటుంది.

చికిత్స ఇలా...

షాక్‌వేవ్‌ థెరపీ:

ఎక్స్‌ట్రా కార్పొరియల్‌ షాక్‌వేవ్‌ థెరపీ ద్వారా హై ఎనర్జీ సౌండ్‌ వేవ్స్‌ నొప్పి ఉన్న ప్రదేశంలో విడుదలయ్యేలా చేసే చికిత్స ఇది. దీని వల్ల ప్లాంటార్‌ ఫాసియా గాయం మాని నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.

స్టిరాయిడ్‌ ఇంజక్షన్‌:

పై చికిత్సా పద్ధతుల వల్ల నొప్పి అదుపులోకి రాకపోతే మడమలోకి స్టిరాయిడ్‌ ఇంజక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఇంజక్షన్‌తో రెండు రోజుల్లోనే నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.

Updated Date - 2022-11-17T11:04:10+05:30 IST