Water: ఈ విధంగా నీళ్లు తాగితే..
ABN , First Publish Date - 2022-11-01T18:36:01+05:30 IST
మనందరికీ దాహం వేసిన తర్వాతే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ దాహం వేయకపోయినా, తరచూ నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ ఉంటే, ఎన్నో ఆరోగ్య ఫలితాలు సమకూరతాయి.
మనందరికీ దాహం వేసిన తర్వాతే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ దాహం వేయకపోయినా, తరచూ నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ ఉంటే, ఎన్నో ఆరోగ్య ఫలితాలు సమకూరతాయి.
అవేంటంటే...
తలనొప్పి: శరీరంలో నీరు తగ్గిందనడానికి తొలి సూచన ఇది. వెంటనే గ్లాసుడు నీళ్లు తాగితే తలనొప్పి తగ్గడం మొదలు పెడుతుంది.
సన్‌బర్న్: ఎండకు చర్మం తేలికగా కమిలిపోతుందంటే, మీ శరీరంలో నీరు తగ్గిందని అర్థం. ఎండలోకి వెళ్లే ముందు, వచ్చిన తర్వాత తప్పనిసరిగా నీళ్లు తాగాలి.
కంటి కింద నలుపు: కళ్ల కింద నలుపు, సంచులు సమస్యలు మొదలైతే నీళ్లను నిర్లక్ష్యం చేస్తున్నామని అర్థం. కళ్లు తేజోవంతంగా వెలిగిపోవాలంటే సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.
మొటిమలు: తరచూ మొటిమలు వేధిస్తుంటే రక్తశుద్ధి తగ్గిందని అర్థం. రోజుకు 8 నుంచి 10 గ్లాసులకు తగ్గకుండా నీళ్లు తాగితే, రక్తంలోని ఇన్‌ఫెక్షన్లు తగ్గి మొటిమలు మటుమాయమవుతాయి.
గోళ్లు, వెంట్రుకలు: ఇవి రెండూ దృఢంగా ఉండాలంటే, సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.
కొవ్వు: శరీరంలో కొవ్వు కరగడానికి నీళ్లు తోడ్పడతాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు తాగే నీటి పరిమాణాన్ని పెంచాలి.
చర్మపు మెరుపు: చర్మం జీవంతో తొణికిసలాడాలంటే తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. నీళ్లు తాగడం వల్ల రక్తప్రసరణ మెరుగై చర్మం మెరుపు సంతరించు కుంటుంది.