2004 Tsunami: మహావిషాదానికి 18 ఏళ్లు

ABN , First Publish Date - 2022-12-26T16:50:42+05:30 IST

2004 డిసెంబరు 26న 9.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో సునామీ ఏర్పడి 14 దేశాల సముద్ర తీరప్రాంతాలు మరుభూములుగా మారాయి.

2004 Tsunami: మహావిషాదానికి 18 ఏళ్లు
2004 Tsunami

డిసెంబరు 26, 2004

ప్రపంచమంతా ఉలిక్కిపడిన రోజు

ఇండొనేషియా సుమత్రా దీవుల సమీపంలో హిందూ మహా సముద్ర గర్భంలో భూకంపంతో సునామీ

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 9.2

30 మీటర్ల ఎత్తు వరకూ ఎగసిపడిన రాకాసి అలలు

14 దేశాల్లో 2,30,000 మంది బలి

ఒక్క భారతదేశంలోనే 16వేల మందికి పైగా మృతి

అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్‌ దాకా తీరప్రాంతం అతలాకుతలం

సముద్ర తీర ప్రాంత ప్రజల జీవితాలు కకావికలం

సర్వం కోల్పోయిన లక్షలాది కుటుంబాలు

న్యూఢిల్లీ: ఇండొనేషియాలోని సుమత్రా దీవుల్లో 2004 డిసెంబరు 26న 9.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో సునామీ ఏర్పడి 14 దేశాల సముద్ర తీరప్రాంతాలు మరుభూములుగా మారాయి. 30 మీటర్ల ఎత్తువరకూ ఎగసిపడిన రాకాసి అలలు 2,30,000 మందిని మింగేశాయి. ఒక్క భారతదేశంలోనే 16వేల మందికి పైగా చనిపోయారు. ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తుగా మారిన ఈ సునామీ కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి లెక్కేలేదు. ఇండొనేషియా మొదలుకొని భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్ సహా అనేక దేశాల్లో సముద్రతీరాల వెంబడి ఎటు చూసినా విధ్వంసమే కనపడింది. ఇది నమోదైంది. ఇండొనేషియా సుమత్రా దీవుల నుంచి మన దేశంలోని తూర్పు తీరాన్ని సునామీ తాకడానికి రెండు మూడు గంటల సమయం పట్టింది. దీంతో లక్షలాది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. సునామీ సంభవించిన ఇండొనేషియాలో లక్షా 67 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఐదు లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారత దేశంలో ఆరున్నర లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

భారత భూభాగంలోని టెక్టోనిక్ పలకాలు, మయన్మార్ భూభాగానికి చెందిన టెక్టోనిక్ పలకాలతో రాపిడి చెందడం వల్ల సముద్రగర్భంలో భారీ భూకంపం సంభవించి సునామీ ఏర్పడిందని నాడు శాస్త్రవేత్తలు తేల్చారు.

సునామీ హెచ్చరికలకు సంబంధించి అధునాతన వ్యవస్థలు లేకపోవడం వల్లే తీవ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేయలేకపోయారని అంటుంటారు. 2004 తర్వాత ప్రపంచ దేశాలు భూకంపాలు, సునామీలను అంచనా వేసే టెక్నాలజీని పరస్పరం పంచుకుంటున్నాయి.

Updated Date - 2022-12-26T16:56:39+05:30 IST