Charles Sobharaj: నేపాల్ జైలు నుంచి విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2022-12-21T19:47:12+05:30 IST

ఇద్దరు అమెరికా టూరిస్టులను హత్య చేసిన కేసులో 2003లో అరెస్టయిన ఫ్రాన్స్‌కు చెందిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్..

Charles Sobharaj: నేపాల్ జైలు నుంచి విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ఖాట్మండు: ఇద్దరు అమెరికా టూరిస్టులను (US tourists) హత్య (Murder) చేసిన కేసులో 2003లో అరెస్టయిన ఫ్రాన్స్‌కు చెందిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ (Charles Sobharaj) ఎట్టకేలకు నేపాల్ (Nepal) జైలు నుంచి విడుదలవుతున్నారు. 19 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించడం, 78 ఏళ్ల వయసును దృష్టిలో ఉంచుకుని ఆయనను విడుదల చేయాలని నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జైలు నుంచి విడుదలైన 15 రోజుల్లోపే ఆయనను దేశం నుంచి పంపించేయాలని కూడా కోర్టు ఆదేశాలిచ్చింది.

భారత పౌరుడికి, వియత్నాం పౌరురాలికి శోభరాజ్ జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లి రెండో భర్త శోభరాజ్‌ను దత్తత తీసుకున్నారు. వాళ్లకు పిల్లలు కలగడంతో శోభరాజ్‌ను నిర్లక్ష్యం చేశారు. దాంతో ఆయన నేరప్రవృత్తికి అలవాటుపడినట్టు చెబుతారు. హత్యలు, మోసాలు, దోపిడీ ఘటనల్లో ఆయన పేరు అప్పట్లో మారుమోగింది. నకిలీ పాస్‌పోర్ట్‌తో నేపాల్‌లోకి అడుగుపెట్టిన శోభరాజ్ 1975లో అమెరికా పౌరుడు Connie Jo Boronzich (29), అతని గాళ్‌ఫ్రెండ్‌ Laurent Carriere (26)ను హత్య చేశాడు. ఒక వార్తాపత్రికలో ఆయన ఫోటో ప్రచురితంకావడంతో 2003 సెప్టెంబర్ 1న నేపాల్‌లోని ఓ కేసినో బయట ఆయనను పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఖాట్మండు సెంట్రల్ జైలులో 21 ఏళ్ల పాటు శిక్ష అనుభవించారు. అమెరికా సిటిజన్ల హత్య కేసులో 20 ఏళ్లు, నకిలీ పాస్‌పోర్ట్ కేసులో ఏడాది జైలు అనుభవించారు.

Updated Date - 2022-12-21T19:54:16+05:30 IST