Aung San Suu Kyi: అంగ్ సాన్ సూకీని విడుదల చేయండి...ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పిలుపు

ABN , First Publish Date - 2022-12-22T08:33:59+05:30 IST

జైలులో ఉన్న మయన్మార్ నాయకురాలి విషయంలో ఐక్యరాజ్యసమితి సంచలన పిలుపు ఇచ్చింది....

Aung San Suu Kyi: అంగ్ సాన్ సూకీని విడుదల చేయండి...ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పిలుపు
Aung San Suu Kyi

యునైటెడ్ నేషన్స్: జైలులో ఉన్న మయన్మార్ నాయకురాలి విషయంలో ఐక్యరాజ్యసమితి సంచలన పిలుపు ఇచ్చింది.(Aung San Suu Kyi)జైలులో ఉన్న ఆంగ్ సాన్ సూకీని విడుదల(Release) చేయాలని ఐక్యరాజ్యసమితి(United Nations) భద్రతా మండలి (Security Council)పిలుపునిచ్చింది.ఆగ్నేయాసియాలో అల్లకల్లోలంగా ఉన్న దేశంలో పరిస్థితిపై మొట్టమొదటి తీర్మానాన్ని ఆమోదించింది.

దాదాపు రెండేళ్ల క్రితం సైన్యం ప్రభుత్వాన్ని పడగొట్టినప్పటి నుంచి 77 ఏళ్ల సూకీ జైలులో ఖైదీగా ఉన్నారు.నిరంకుశంగా నిర్బంధించిన ఖైదీలందరినీ తక్షణమే విడుదల చేయాలని యునైటెడ్ నేషన్స్ కోరింది. హింసను నిలిపివేసి,మానవ హక్కులు, స్వేచ్ఛను కాపాడాలని యూఎన్ కోరింది. 14 ఆరోపణల్లో ప్రతి ఒక్కదానిపై నోబెల్ బహుమతి గ్రహీతను దోషిగా నిర్ధారించింది. దీంతో ఆమెకు 26 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

Updated Date - 2022-12-22T08:34:00+05:30 IST