పరస్పర బదిలీలకు మీసేవలోనూ దరఖాస్తులు
ABN , First Publish Date - 2022-03-06T08:53:39+05:30 IST
ఉద్యోగులు పరస్పర బదిలీల కోసం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
హైదరాబాద్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ఉద్యోగులు పరస్పర బదిలీల కోసం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చునని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సూచించారు. ఒకే కేటగిరి, ఒకే శాఖలోని ఉద్యోగులు జీవోనెం.21 ద్వారా పరస్పర బదిలీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 15 వరకు అవకాశం ఉందన్నారు. కాగా, పరస్పర బదిలీలు కోరుతూ ఇప్పటిదాకా 870 వరకు దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.