అనాథాశ్రమాల్లో సీసీ కెమేరాలు పెట్టాలి: హైకోర్టు
ABN , First Publish Date - 2022-03-06T08:55:04+05:30 IST
అనాథాశ్రమాల్లో సీసీ కెమేరాలు పెట్టాలి: హైకోర్టు
హైదరాబాద్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): అన్ని మదర్సాలు, అనాథాశ్రమాలు, షెల్టర్ హోమ్స్, జువెనైల్ హోమ్స్‌లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఇలాంటి సంస్థల్లో వీటిని ఏర్పాటు చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన డి. నర్సింహాచారి గతంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌పై విచారణ చేపట్టింది. దీనిపై ప్రమాణ పత్రం సమర్పించిన డీజీపీ.. సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. తాజా సమాచారంతో వివరాలు సమర్పించాలని సూచిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.