ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం: రాహుల్

ABN , First Publish Date - 2022-03-10T21:54:37+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ నిరాశాజనక ఫలితాలు చవిచూడటంపై..

ప్రజాతీర్పును శిరసావహిస్తున్నాం: రాహుల్

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ పార్టీ నిరాశాజనక ఫలితాలతో ఓటమిని చవిచూడటంపై ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాతీర్పును హుందాగా స్వీకరిస్తున్నామని అన్నారు. గెలిచిన వారందికీ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపు కోసం అంకిత భావంతో, కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వలంటీర్లందరికీ ఒక ట్వీట్‌లో రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాతీర్పును విశ్లేషించుకుని ముందుకు సాగుతామని, దేశ ప్రజల ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషిని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్‌‌తో పాటు గోవాలోనూ బీజేపీ మరోసారి హవా కొనసాగించగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం తాము అధికారంలో ఉన్న పంజాబ్‌ను కోల్పోయింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.

Updated Date - 2022-03-10T21:54:37+05:30 IST