ఓటుపై అవగాహనకు జాతీయ స్థాయి పోటీలు
ABN , First Publish Date - 2022-03-06T08:59:16+05:30 IST
ఓటుకున్న ప్రాధాన్యాన్ని తెలిపే విధంగా జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. తొలిసారిగా ఓటరు అవగాహనా సదస్సులు నిర్వహించి..
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఓటుకున్న ప్రాధాన్యాన్ని తెలిపే విధంగా జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం తెలిపింది. తొలిసారిగా ఓటరు అవగాహనా సదస్సులు నిర్వహించి.. అందులో క్విజ్, చైతన్య పరిచే పాటలు, వీడియోమేకింగ్, పోస్టర్ డిజైన్ పోటీలను నిర్వహిస్తామని పేర్కొంది. ఈ మేరకు ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ‘నా ఓటే నా భవిష్యత్తు- ఒక్క ఓటుకున్న శక్తి’ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహిస్తామని, 15లోగా దరఖాస్తులు పంపాలని కోరింది. పూర్తి వివరాల కోసం ఉఛిజీటఠ్ఛ్ఛిఞ.ఝజీఛి.జీుఽ/ఛిౌుఽ్ట్ఛట్ట వెబ్‌సైట్‌ను వీక్షించాలని సూచించింది.