సర్దుబాటుపై స్పెషలిస్టు వైద్యుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-06T08:55:37+05:30 IST

వైద్య ఆరోగ్యశాఖలో ఇటీవల చేపట్టిన సర్దుబాటు ప్రక్రియపై పలువురు స్పెషలిస్టు వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదని,

సర్దుబాటుపై స్పెషలిస్టు వైద్యుల ఆగ్రహం

హైదరాబాద్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలో ఇటీవల చేపట్టిన సర్దుబాటు ప్రక్రియపై పలువురు స్పెషలిస్టు వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదని, తమ సీనియారిటీని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని స్పెషలిస్టు వైద్యులను వైద్య విద్య సంచాలకులు, వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రులకు ఇటీవల సర్దుబాటు చేశారు. వీరందరి సీనియారిటీని పరిగణనలోకి తీసుకోమని అధికారులు చెప్పారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిబంధనల కారణంగా బోధనాస్పత్రలకు వెళ్లిన వారి సీనియారిటీ కూడా జీరో అయింది. ఈ విషయాన్ని కొందరు వైద్యులు మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లగా... సమస్యను పరిష్కరిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు. కానీ ఆ మరుసటి రోజునే సీనియారిటీని పరిగణనలోకి తీసుకోమంటూ వైద్యవిదాన పరిషత్‌ కమిషనర్‌ రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారని సీనియారిటీ కోల్పోయిన ఓ వైద్యుడు వెల్లడించారు. తమ సర్వీసు గురించి ధైర్యంగా ప్రశ్నించే పరిస్థితి కూడా ఎవరికీ లేదని వాపోయారు. 

Updated Date - 2022-03-06T08:55:37+05:30 IST