November Bank Holidays: నవంబర్ నెలలో 10 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే..
ABN , First Publish Date - 2022-10-26T18:28:12+05:30 IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు జాబితాను విడుదల చేసింది. ఈ పది రోజుల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా ఉన్నాయి.
మరో ఐదు రోజుల్లో అక్టోబర్ నెల పూర్తి కావొస్తోంది. వచ్చే మంగళవారం నుంచి నవంబర్ నెల ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారానే ఎక్కువ శాతం లావాదేవీలు జరుగుతున్నప్పటికీ.. బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. బ్యాంకులకు సెలవులు ఉంటే చాలా లావాదేవీలు ఆగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నవంబర్ నెలలో బ్యాంకు సెలవులు జాబితాను విడుదల చేసింది. ఈ పది రోజుల్లో నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కూడా ఉన్నాయి.
నవంబర్ 1: కన్నడ ఆవివర్భావ దినోత్సవం - బెంగళూరు, ఇంఫాల్‌లో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 6: ఆదివారం
నవంబర్ 8: గురునానక్ జయంతి
నవంబర్ 11: కనకదాస జయంతి- బెంగళూరు, షిల్లాంగ్‌లలో బ్యాంకులకు సెలవు.
నవంబర్ 12: రెండో శనివారం
నవంబర్ 13: ఆదివారం
నవంబర్ 20: ఆదివారం
నవంబర్ 23: సెంగ్ కుత్సానెం - షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు
నవంబర్ 26: నాలుగో శనివారం
నవంబర్ 27: ఆదివారం