Big Boost to Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రకు కొత్త జోష్

ABN , First Publish Date - 2022-10-31T08:29:27+05:30 IST

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు(Bharat Jodo Yatra) నవంబర్ 8వతేదీన కొత్త జోష్ రానుంది.(Big Boost to Rahul Gandhi) భారత్ జోడో యాత్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)(Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) పాల్గొననున్నారు.

Big Boost to Bharat Jodo Yatra: రాహుల్ భారత్ జోడో యాత్రకు కొత్త జోష్
Rahul Gandhis Bharat Jodo Yatra

నాందేడ్(మహారాష్ట్ర): కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు(Bharat Jodo Yatra) నవంబర్ 8వతేదీన కొత్త జోష్ రానుంది.(Big Boost to Rahul Gandhi) భారత్ జోడో యాత్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)(Nationalist Congress Party) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) పాల్గొననున్నారు. నవంబర్ 8వతేదీన రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో నాందేడ్ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశించిన ఒక రోజు తర్వాత పవార్ యాత్రలో చేరనున్నారు. దేశవ్యాప్త యాత్రలో భాగం కావాలని కాంగ్రెస్ ఇచ్చిన ఆహ్వానాన్ని పవార్ అంగీకరించి యాత్రలో పాల్గొనబోతున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే చెప్పారు. మహారాష్ట్రలో జోడో యాత్ర సన్నాహాలను సమీక్షించేందుకు జరిగిన సమావేశంలో పటోలే మాట్లాడారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ హెచ్‌కే పాటిల్, పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు కూడా ఆహ్వానం అందిందని, అయితే ఆయన పాల్గొనేది లేనిది ఇంకా ధృవీకరించలేదని పటోలే చెప్పారు.భారత్ జోడో యాత్రలో భాగంగా బుల్దానాలోని నాందేడ్, షెగావ్ ర్యాలీల్లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని పటోలే చెప్పారు. నాందేడ్‌లో భారత్ జోడో యాత్ర ప్రవేశంతో (హైదరాబాద్) నిజాం పాలన నుంచి మరాఠ్వాడా విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాందేడ్‌లో రాహుల్ గాంధీతో కలిసి ఈ వేడుకను జరుపుకుంటామని పటోలే వివరించారు.

Updated Date - 2022-10-31T08:30:41+05:30 IST