Home » bharat jodo yatra
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలు కలిపేవి కాదని అవి విదదీసే ( తోడో ) యాత్రలు అని ఫైర్ అయ్యారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీది భారత్ జోడో న్యాయ్ యాత్ర.. కాంగ్రెస్ తోడో, కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని విమర్శించారు. గత అనుభవాలు చూస్తే రాహుల్ గాంధీ యాత్రలు చేసిన ప్రతిచోట కాంగ్రెస్ ఓడిపోతుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న ముంబైలో మరో విఫల యాత్రను ముగించారని ఎద్దెవా చేశారు.
రాహుల్ గాంధీ సారథ్యంలోని 'జన్ న్యాయ్ పాదయాత్ర' ముంబైలో కొనసాగుతోంది. ఆదివారం జరిగిన పాదయాత్రలో నటి స్వర భాస్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాహుల్‌తో కలిసి పాదయాత్రలో ఆమె పాల్గొన్న వీడియోను కాంగ్రెస్ పార్టీ అధికారిక 'ఎక్స్' ఖాతాలో షేర్ చేసింది.
2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2024 జనవరి 14 న మణిపుర్ నుంచి ప్రారంభమైన కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్ర నిన్న (మార్చి 16) ముంబయిలో ముగిసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఇవాళ పాదయాత్ర నిర్వహించారు.
ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bonds) వ్యవహారంపై బీజేపీపై (BJP) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన విమర్శలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) కౌంటర్ ఇచ్చారు. తమ కాంగ్రెస్ పార్టీ (Congress Party) అందుకున్న ఎలక్టోరల్ బాండ్లను రాహుల్ తిరిగి ఇస్తారా? అని ప్రశ్నించారు.
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న ప్రస్తుత తరుణంలో పార్టీలన్నీ తమ అస్త్రశస్త్రాలను సంధించుకుంటున్నాయి. అభ్యర్థుల ప్రకటనతో ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నాయి.
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది. యాత్ర సందర్భంగా మంగళవారంనాడు షాజపూర్ సిటీలో రాహుల్‌కు బీజేపీ కార్యకర్తలు వినూత్న రీతిలో స్వాగతం పలికారు. రాహుల్ సైతం హుందాగా వారి ఆహ్వానాన్ని స్వీకరిస్తూ కొద్దిసేపు వారితో ముచ్చటించి ఆ తర్వాత ముందుకు కదిలారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పొత్తు పొసగక ఎడమొహం పెడమొహంగా ఉన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, బీఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ లు ఇవాళ ఒక్కచోట కలుసుకున్నారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా...
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల మధ్య సీట్ల లెక్క తేలిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాల్గొననున్నారు.
రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ఉత్తరప్రదేశ్ లో సాగుతోంది. కాంగ్రెస్ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతూ రాహుల్ గాంధీ యాత్రలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా శనివారంనాడు పాల్గోనున్నారు. మొరాదాబాద్ లో రాహుల్‌తో ప్రియంక కలుస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.