Mahesh-Gautham: మహేష్ - గౌతమ్ ని చూశారా, ఎలా వున్నారో.. 

ABN , First Publish Date - 2022-11-17T14:07:07+05:30 IST

మహేష్ ముందుగా నడుస్తూ వుంటే, వెనకాల గౌతమ్ అతన్ని అనుసరిస్తూ వుంటే, ఆ ఇద్దరినీ చూసుకుంటూ అభిమానులు తన్మయత్వం చెందారు.

Mahesh-Gautham: మహేష్ - గౌతమ్ ని చూశారా, ఎలా వున్నారో.. 
Mahesh Babu and Gautham

సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి అంత్యక్రియలు బుధవారం ఆయన అభిమానులు, అశేష జనావళి మధ్య ముగిశాయి. ఈ అంత్యక్రియలు జరిగే ముందు కృష్ణ గారి పార్థివ దేహాన్ని ఆయనికి అత్యంత ఇష్టం అయిన పద్మాలయా స్టూడియో లో కొద్దిసేపు అభిమానుల సందర్శనార్ధం వుంచారు. ఆ సమయం లో వేలమంది కృష్ణ గారి అభిమానులు ఆయనకి తుది నివాళులు అర్పించారు. అదే సమయంలో మహేష్ బాబు తనయుడు గౌతమ్, కూతురు సితార కూడా తమ తాతని కడసారి చూసేందుకు పద్మాలయా స్టూడియో కి మహేష్ బాబు తో కలిసి వచ్చారు. మహేష్ ముందుగా నడుస్తూ వుంటే, వెనకాల గౌతమ్ అతన్ని అనుసరిస్తూ వుంటే, ఆ ఇద్దరినీ చూసుకుంటూ అభిమానులు తన్మయత్వం చెందారు. అక్కడే లైన్ లో వున్న అభిమానులు అందరూ, గౌతమ్ ఎంత పెద్ద వాడు అయిపోయాడు, తండ్రి మహేష్ బాబు కన్నా పొడుగు అయిపోయాడు, హీరో లా వున్నాడు అని అనుకుంటూ వున్నారు. అలాగే మహేష్, గౌతమ్ లు ఇద్దరూ నడుచుకుంటూ  వస్తున్నప్పుడు ఇంక మహేష్ వారసత్వాని గౌతమ్ పుచ్చుకుంటాడు అన్నట్టుగా వున్నాడు అని అభిమానులు గుసాగుసలాడుకుంటున్నారు. కృష్ణ గారు అప్పట్లో గొప్ప అందగాడు అనుకుంటే, ఆ తరువాత వచ్చిన మహేష్ బాబు ఇంకా అందంగా వుండి, చిత్ర పరిశ్రమలో తనంత అందగాడు లేడు అని అనిపించుకున్నాడు. ఇప్పుడు గౌతమ్ ని చూశాక, మహేష్ బాబు, కృష్ణ గారి ల కన్నా ఇంకా అందంగా తయారావుతున్నాడు అన్నట్టుగా వున్నాడు అని అక్కడే వున్న అభిమానులు అనుకుంటున్నారు. 

Updated Date - 2022-11-17T14:25:17+05:30 IST