Bhagat Singh: భగత్ సింగ్ ఉరి ఘట్టం రిహార్సల్స్ చేస్తూ 12 ఏళ్ల బాలుడు మృతి

ABN , First Publish Date - 2022-10-31T15:05:22+05:30 IST

చిత్రదుర్గ: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఉరి సన్నివేశం రిహార్సల్స్ చేస్తూ 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గత శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని, 12 ఏళ్ల సంజయ్ గౌడ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

Bhagat Singh: భగత్ సింగ్ ఉరి ఘట్టం రిహార్సల్స్ చేస్తూ 12 ఏళ్ల బాలుడు మృతి

చిత్రదుర్గ: కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ ఉరి సన్నివేశం రిహార్సల్స్ చేస్తూ 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. గత శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని, 12 ఏళ్ల సంజయ్ గౌడ (Sanjay Gowda) ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం, స్థానిక ఎస్‌ఎల్‌వీ పాఠశాలలో సంజయ్ గౌడ ఏడో తరగతి చదువుతున్నాడు. నవంబర్ 1న కర్ణాటక రాజ్యోత్సవ వేడుకల సందర్భంగా కళాశాలలో భగత్ సింగ్ నాటకం వేయాల్సి ఉంది. ఇందులో భగత్ సింగ్ పాత్ర అతనికి అప్పగించారు. ఇందుకోసం ఇంట్లో రిహార్సల్స్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ అతను మరణించాడు. ఇంట్లో పెద్ద వాళ్లంతా పనుల కోసం బయటకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది.

''నాటకం రిహార్సల్స్ కోసం రూములో ఒక తాడును ఫ్యానుకు కట్టినట్టు కనిపిస్తోంది. ఉలెన్ క్యాప్‌ను తలకు తొడుక్కుని, మెడ చుట్టూ ఉచ్చు వేసుకున్నాడు. మంచం మీద నుంచి కిందకు దూకడంతో నిమిషాల్లోనే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయినట్టు కనిపిస్తోంది'' అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన తల్లిందండ్రులు విగత జీవుడుగా తమ పిల్లవాడు కనిపించడంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, భగత్ సింగ్ నాటకం కోసం అదేరోజు పాఠశాలలో కూడా పిల్లలు రిహార్సల్స్ వేశారని, అయితే స్టూల్ ఉపయోగించలేదని అదే స్కూలులో తన కుమారుడిని కూడా చదివిస్తున్న సుందర్ రాజ్ తెలిపాడు. గౌడ చాలా ఫ్రెండ్లీగా, ఎంతో చురుకుగా ఉండేవాడని చెప్పారు.

Updated Date - 2022-10-31T17:55:27+05:30 IST