Chhrapra hooch Tragedy: కల్తీ మద్యం తాగి 20 మంది మృతి.. ఛాప్రాలో విషాదం

ABN , First Publish Date - 2022-12-14T16:52:37+05:30 IST

బీహార్‌లోని సరన్ జిల్లా ఛాప్రా ప్రాంతంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి సుమారు 20 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు..

Chhrapra hooch Tragedy: కల్తీ మద్యం తాగి 20 మంది మృతి.. ఛాప్రాలో విషాదం

సరణ్: బీహార్‌లోని సరన్ జిల్లా ఛాప్రా (Chhapra) ప్రాంతంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం (Illicit Liquor) తాగి సుమారు 20 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే, అనుమానాస్పద మృతికి ఇతమిత్ధమైన కారణం ఏమిటనేది ఇసావుర్‌పూర్ పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. మాధేపూర్ డీఎస్‌పీ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. 2016 నుంచి బీహార్‌లో సంపూర్ణ మద్యనిషేధం అమలులో ఉండటంతో ఇంటరాగేషన్ భయంతో పలువురు అస్వస్థతకు గురైన వారు అజ్ఞాతంలోకి వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో పోలీసులు గాలిస్తున్నారు. ఛాప్రా సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అమిత్ రంజన్ అనే వ్యక్తి మరణించడంతో జిల్లా పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.

కాగా, కల్తీ కల్లు తాగి ప్రాణాలు కోల్పోయిన వారిలో విజేంద్ర రాయ్, హరీంద్ర రామ్, రామ్జీ సహ, అమిత్ రంజన్, సంజయ్ సింగ్, కునల్ సింగ్, అజయ్ గిరి, ముఖేష్ శర్మ, భరత్రామ్, జయదేవ్ సింగ్, మనోజ్ రామ్, మంగళ్ రాయ్, నజీర్ హుస్సేన్, రమేష్ రామ్, చంద్రరామ్, విక్కీ మహతో, లలన్ రామ్, గోవింద్ రాయ్, ప్రేమ్‌చంద్ షా, దినేష్ ఠూకర్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీనికి ముందు, ఎస్‌పీ ఎస్.కుమార్ ఓ ట్వీట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించిన ముగ్గురిని పోస్ట్‌మార్టం కోసం పంపినట్టు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో మరికొందరు చికిత్స పొందుతుంన్నట్టు సమాచారం ఉందని చెప్పారు. కల్తీ మద్యం వల్లే మరణాలు సంభవించినట్టు ఆయా కుటుంబ సభ్యులు చెబుతుండగా, పోలీసులు మాత్రం ఇంతవరకూ ధ్రువీకరించ లేదు.

Updated Date - 2022-12-14T16:52:38+05:30 IST