Lunar eclipse: భారత్‌లో వీడిన చంద్రగ్రహణం
ABN , First Publish Date - 2022-11-08T19:07:50+05:30 IST
హైదరాబాద్: భారత్‌లో చంద్రగ్రహణం వీడింది.
హైదరాబాద్: భారత్‌లో చంద్రగ్రహణం వీడింది. తెలుగు రాష్ట్రాల్లో 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాలు కనిపించింది. దేశంలో కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, కొన్ని నగరాల్లో పాక్షికంగా కనిపించింది. పౌర్ణమి వేళ సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి రావడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది ఇదే చివరి గ్రహణం. మళ్లీ 2025 మార్చ్ 14న మరోసారి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఖగోళ అద్భుతాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించారు. గ్రహణం వీడటంతో తెలుగు రాష్ట్రాల్లో విడుపు స్నానాలు మొదలయ్యాయి.
మరోవైపు చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మూసేసిన దేవాలయాలను సంప్రోక్షణ తర్వాత తిరిగి తెరుస్తారు.