Morbi bridge tragedy: ప్రాణాలతో బయటపడిన 4 ఏళ్ల బాలుడు.. కానీ తల్లిదండ్రులు మృతి
ABN , First Publish Date - 2022-10-31T17:46:19+05:30 IST
మోర్బి: యావద్దేశాన్ని కుదిపేసిన గుజరాత్‌లోని మోర్బీ వంతెన కుప్పకూలిన విషాద ఘటనలో ఓ నాలుగేళ్ల బాలుడు మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఆ చిన్నారి తల్లిదండ్రుల మాత్రం కన్నుమూశారు.
మోర్బి: యావద్దేశాన్ని కుదిపేసిన గుజరాత్‌లోని మోర్బీ వంతెన (Morbi bridge) కుప్పకూలిన విషాద ఘటనలో ఓ నాలుగేళ్ల బాలుడు (4 years old boy) మృత్యుంజయుడిలా ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఆ చిన్నారి తల్లిదండ్రుల మాత్రం కన్నుమూశారు. బ్రిడ్జి నుంచి నీటిలో పడిపోయిన 141 మంది మృతదేహాలను ఇంత వరకూ సహాయక బృందాలు వెలికితీశారు. తమ ప్రియతములను కోల్పోయిన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కాగా, ఇంత పెను ప్రమాదం నుంచి నాలుగేళ్ల జియాన్స్ ప్రాణాలతో బయటపడ్డాడు. హార్దిక్ ఫల్డు, ఆయన భార్య మిరాల్‌బెన్‌లు జియాన్స్‌తో కలిసి కేబుల్ బ్రిడ్జి చూడడానికి వెళ్లారు. అక్కడ జరిగిన ప్రమాదంలో హార్దిక్, మిరాల్‌బెన్ విగతజీవులయ్యారు. వీరితో పాటే వెళ్లిన హార్దిక్ అంకుల్ హర్ష ఈ ప్రమాదం నుంచి గాయాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హల్వాద్ టౌన్‌లో హార్దిక్ ఉండేవారని ఉమా టౌన్ నివాసి ఒకరు తెలిపారు. హార్దిక్, ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలను హల్వాద్‌కు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.