Morbi bridge collapse: మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సస్పెండ్

ABN , First Publish Date - 2022-11-04T14:41:57+05:30 IST

అహ్మదాబాద్: మోర్బీ బ్రిడ్జి కూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించి మోర్బీ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలాను..

Morbi  bridge collapse: మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సస్పెండ్

అహ్మదాబాద్: మోర్బీ బ్రిడ్జి కూలిపోయి 135 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను సీరియస్‌గా తీసుకున్న గుజరాత్ ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించి మోర్బీ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలా (Sandipsinh Zala)ను శుక్రవారంనాడు సస్పెండ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ సస్పెండైన సందీప్ సిన్హ్ జలా స్థానంలో అడిషనల్ చీఫ్ ఆఫీసర్‌గా మోర్బీ రెసిడెంట్ అడిషనల్ కలెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తారని అధికారిక ఉత్తర్వులో పేర్కొన్నారు. మోర్బీ టౌన్‌లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జి నిర్మాణ ఆదివారం సాయంత్రం కూలిపోవడంతో ఘోర విషాదం చోటుచేసుంది. పిల్లలు, మహిళలతో సహా అనేక మంది జలాల్లో పడి కన్నుమూశారు. ఘోర విషాదానికి కారణమైన మోర్బీ బ్రిడ్జి మరమ్మతు, మెయింటెనెన్స్ బాధ్యతలను ఓరెవ గ్రూప్ చూస్తోంది. ఇందుకు సంబంధించి కాంట్రాక్టును 15 ఏళ్ల పాటు ఆ గ్రూప్‌కు మోర్బీ మున్సిపాలిటీ ఇచ్చింది. మోర్బీ దుర్ఘటన వెనుక మెయింటెనెన్స్ లోపాలు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. బ్రిడ్జి విషాద ఘటనకు సంబంధించి ఇంతవరకూ తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated Date - 2022-11-04T16:42:34+05:30 IST