Shraddha Murder case: అఫ్తాబ్ ఇంట్లో మారణాయుధాలు స్వాధీనం

ABN , First Publish Date - 2022-11-19T20:10:59+05:30 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాల్కర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా ఉపయోగించినట్టుగా భావిస్తున్న...

Shraddha Murder case: అఫ్తాబ్ ఇంట్లో మారణాయుధాలు స్వాధీనం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధ వాల్కర్ హత్య కేసు (Shraddha Walkar Murder case)లో నిందితుడు అఫ్తాబ్ పూనావాలా (Aftab Poonawalla) ఉపయోగించినట్టుగా భావిస్తున్న మారణాయుధాలను (Cutting tools) ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అఫ్తాబ్ ఇంట్లో పదునైన కటింగ్ టూల్స్‌ను కనుగొన్నారు. వీటిని ఉపయోగించే శ్రద్ధా వాల్కర్‌ను అతను 35 ముక్కలుగా నరికి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. వీటికి తోడు, అఫ్తాబ్, శ్రద్ధ వాడిన దుస్తులను కూడా పోలీసులు సీజ్ చేసి ల్యాబ్‌ పరీక్షలకు పంపారు. అయితే, నేరం జరిగిన రోజు వారిద్దరూ ధరించిన దుస్తులు మాత్రం తమకింకా దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.

కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, శ్రద్ధ స్నేహితులు రాహుల్ రయి, గాడ్విన్ రోడ్రిగ్జ్‌లను పోలీసులు ప్రశ్నించేందుకు పిలిపించారు. పోలీసులకు కానీ, సన్నిహితులకు కానీ చెప్పాపెట్టకుండా పరారైన అఫ్తాబ్ కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. తమ కుమార్తెను నరికిచంపిన నేరంలో అఫ్తాబ్ కుటుంబ సభ్యులకు కూడా ప్రమేయం ఉందని శ్రద్ధ తండ్రి ఇటీవల ఆరోపించారు. కాగా, శ్రద్ధ హత్య కేసులో ఐదు రోజుల్లోపు ఆఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ జరపాలని రోహిణి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ను సాకేత్ కోర్టు ఈనెల 18న ఆదేశించింది. మరోవైపు, అఫ్తాబ్ మొబైల్ ఫోన్, కెమెరా, ల్యాప్‌టాప్‌ల విశ్లేషణను నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ జరుపుతోంది.

Updated Date - 2022-11-19T20:11:47+05:30 IST