Xi Jinping: యుద్ధానికి సన్నద్ధమవ్వండి.. చైనా ఆర్మీకి జిన్‌పింగ్ పిలుపు
ABN , First Publish Date - 2022-11-09T22:07:05+05:30 IST
అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) జనరల్ సెక్రటరీగా పునర్నియామకమైన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బీజింగ్: అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC) జనరల్ సెక్రటరీగా పునర్నియామకమైన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Xi Jinping) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చైనా జాతీయ భద్రత అస్థిర పరిస్థితిని ఎదుర్కొంటుందని అన్నారు. యుద్ధానికి సన్నద్ధమవ్వాలంటూ పీపుల్ లిబరేషన్ ఆర్మీ(PLa)కి ఆయన పిలుపునిచ్చారు. ఆర్మీ అన్ని సామర్థ్యాలను మరింత పెంపొందించుకుని యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నారు. పోరాడి గెలిచేలా సంసిద్ధమవ్వాలని సూచించారు.
మంగళవారం బీజింగ్ నగరంలోని సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC) జాయింట్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా జిన్‌పిగ్ ప్రస్తుతం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా హెడ్‌గా, మిలిటరీ హెడ్‌గా, దేశాధిపతిగా మూడు శక్తివంతమైన పదవులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.