మొటిమల మచ్చలు మాయం
ABN , First Publish Date - 2022-10-27T05:54:35+05:30 IST
మొటిమలు, పొక్కులు, పుండ్లు... మొటిమల వికృత రూపాలు అనేకం. వీటిలో ఏదొచ్చినా అమ్మాయిల గుండెలు గుభేలంటాయి.
మొటిమలు, పొక్కులు, పుండ్లు... మొటిమల వికృత రూపాలు అనేకం. వీటిలో ఏదొచ్చినా అమ్మాయిల గుండెలు గుభేలంటాయి. వాటిని వదిలించుకునేవరకూ తోచిన చిట్కాలన్నీ పాటిస్తూ ఉంటారు. అయితే వాటిని వదిలించుకున్నా వాటి ఆనవాళ్లు మచ్చల రూపంలో ముఖాన్ని అందవికారంగా తయారు చేసేస్తాయి. ఇలా జరగకుండా ఉండాలంటే సౌందర్య నిపుణులు సూచించే సురక్షితమైన చిట్కాలనే అనుసరించాలి. మొటిమల చికిత్స కోసం ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, షహనాజ్ హుస్సేన్ సూచిస్తున్న ఈ చిట్కాలు పాటించి చూడండి.
రోజ్ వాటర్
రోజ్ వాటర్, యాస్ట్రింజెంట్
సమపాళ్లలో కలుపుకోవాలి.
ముఖం శుభ్రంగా కడిగి, తుడిచి ఈ మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేయాలి.
ఆరిన తర్వాత కడిగేసుకోవాలి.
ఇలా రోజుకి 3 సార్లు చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
పసుపు, పెరుగు
ఈ రెండు కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.
దీన్ని ముఖం మీద అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వాలి.
తర్వాత నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి.
గంధం, రోజ్‌వాటర్
గంధం పొడికి కొన్ని చుక్కల రోజ్‌వాటర్ చేర్చి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ముఖం మీద మొటిమలు ఉన్న చోట ఈ పేస్ట్ రాసి గంటపాటు వదిలేయాలి.
తర్వాత శుభ్రంగా కడిగేయాలి.
వేప ఆకులు
గుప్పెడు వేప ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి.
ఈ ఆకులను కొద్దిసేపు నీళ్లలో
మరిగించాలి.
నీళ్లు రంగు మారేవరకూ ఆగి చల్లారనివ్వాలి.
ఈ నీళ్లను వడగట్టి ఈ నీటితోనే రోజూ ముఖం కడగటానికి ఉపయోగించాలి.