Latest fashion trend : లవ్లీ ‘లెహెంగా - చోళీ’
ABN , First Publish Date - 2022-10-26T00:25:09+05:30 IST
లంగా జాకెట్టులో ఏ అమ్మాయి అయినా లవ్లీగా కనిపిస్తుంది. అందుకే సంప్రదాయ లంగా జాకెట్లు కాస్తా లెహెంగా చోళీ పేరుతో లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోయాయి.
లంగా జాకెట్టులో ఏ అమ్మాయి అయినా లవ్లీగా కనిపిస్తుంది. అందుకే సంప్రదాయ లంగా జాకెట్లు కాస్తా లెహెంగా చోళీ పేరుతో లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిపోయాయి. జర్దోసీ, ఎంబ్రాయిడరీ, బాతిక్, బనారసీ...ఇలా ఎన్నో వెరైటీ హంగులు అద్దుకున్న లెహెంగా చోళీలతో మీ వార్డ్‌రోబ్ కూడా నింపేసుకోండి.
నాజూకుగా: లెహంగా, చోళీలో బొద్దుగా ఉండే ముద్దుగుమ్మలు సైతం నాజూకుగా కనిపిస్తారు. అయితే బొద్దుగా ఉండేవాళ్లు లేత రంగుల్లోని లెహంగా, చోళీలనే ఎంచుకోవాలి. వీలైనంత తక్కువ జరీ, డిజైన్లు ఉండేలా చూసుకోవాలి. సన్నజాజి మొగ్గల్లా ఉండే అమ్మాయిలు భారీ లెహంగా, చోళీలను ఎంచుకోవచ్చు. అలాగే ముదురు రంగులు బాగుంటాయి.
జ్యువెలరీ: లెహంగా, చోళీల ఆకర్షణ ధరించే నగల మీద కూడా ఆధారపడి ఉంటుంది. చోకర్లు, నెక్లె్‌సలు, జూకాలు ఈ దుస్తులకు నప్పుతాయి. అయితే ధరించే లెహంగాకు మ్యాచ్ అయ్యే ఎనామిల్, లేదా స్టోన్ జ్యువెలరీ ఎంచుకోవాలి.
చెప్పులు: జూతీలు లెహంగాలకు చక్కగా మ్యాచ్ అవుతాయి. అలాగని హై హీల్స్ వేసుకోకూడదనే నియమం కూడా లేదు. మరింత నాజూకుగా కనిపించడం కోసం హైహీల్స్ కూడా ఎంచుకోవచ్చు.