Loneliness; అందరూ ఉన్నా..ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? దానిని వదిలించుకోండిలా..

ABN , First Publish Date - 2022-10-25T11:40:17+05:30 IST

ఒంటరితనానికి, ఏకాంతానికి ఎంతో తేడా ఉంది. ఏకాంతంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒంటరితనంలో ఒత్తిడి ఉంటుంది.

Loneliness; అందరూ ఉన్నా..ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? దానిని వదిలించుకోండిలా..
Loneliness

ఈ ఒంటరితనం అనేది ఆధునిక జీవన విధానంలో మామూలు విషయంగా మారుతోంది. చుట్టూ ఎందరు ఉన్నా వారితో కలవలేని తనం పెరుగుతుంది. మనసులోని భావాలను ఎదుటివారితో షేర్ చేసుకునే తత్వం కూడా తగ్గిపోతూ వస్తుంది.

నా అన్నవాళ్ళు లేక ఒంటరితనం అనుభవించే వారికన్నా అందరూ ఉండి ఒంటరితనంలో కూరుకుపోయేవారు కొందరు., ఒంటరితనానికి, ఏకాంతానికి ఎంతో తేడా ఉంది. ఏకాంతంతో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒంటరితనంలో ఒత్తిడి ఉంటుంది. ఇది మనిషిని నెమ్మదిగా డిఫ్రెషన్ వైపు కుంగదీస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.

ఈ నిరంతర ఒంటరితనం అనేది ఒక మానసిక రుగ్మతలా మారుతూ ఉంది. ఒంటరితంలో ఉంటూ ఎదుటివారు తనతో కలవడం లేదనే కొత్త కోణంలోంచి మిగతావారిని చూస్తారు. దీనితో ఎవరితోనూ మనసులో భావాలను పంచుకోకపోవడం, వారిలో వారే కుమిలిపోవడం లాంటి సమస్యల్లో కూరుకుపోతున్నారు.

2014లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం, "ఒంటరిగా ఉండటం వల్ల కాదు, మన చుట్టూ ఉన్నవారితో సంబంధం లేనట్టు ఉండటం వారిని దూరం పెట్టడం వల్ల ఒంటరితనం ఏర్పడుతుంది."అని తేలింది. ఈ ఒంటరితనం అనేక సైకలాజికల్ సమస్యలకు దారితీస్తుందని శారీరక ఆరోగ్య సమస్యలకు కూడా దోహదపడుతుందని ఈ అధ్యయనం చెపుతుంది. ఒంటరితనం CtrA అనే జన్యువు శరీరాన్ని అనారోగ్యానికి గురిచేస్తుంది. 2018లో జరిపిన మరో అధ్యయనంలో ఒంటరితనం లోని ఒత్తిడి వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని తెలింది.

దీనిని అదిగమించే మార్గాలు.. ఇవి.

1. ఒంటరితనం ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకోండి. పరిష్కారానికి దారులు వెతకండి.

2. ఎవరితోనూ కలవలేకపోవడంలో కారణమైన మీలోని లోపాలను అంగీకరించండి.

3. వాస్తవ ప్రపంచంలో మీ చుట్టూ ఉన్న వారితో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి.

4. వాస్తవ ప్రపంచంలో సంబంధాలను ఏర్పరచుకోవడం ముఖ్యం. స్నేహితులను తరుచుగా కలిసి వారితో కొంత సమయాన్ని గడపండి.

5. ఇతరులతో కలిసి చేయగలిగే పనుల కోసం సమయాన్ని వెచ్చించండి.

6. రోజువారీ జీవితంలోని అనుభవాలలో మునిగిపోండి. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోండి.

7. కుటుంబంతో గడిపే క్షణాలను ఆస్వాదించండి. కమ్మని సంగీతాన్ని వినండి.

ఒంటరితనంతో పోరాటం చేయడానికి చురుకైన ప్రయత్నాలు చేయండి. ఇలాంటి వ్యాపకాలతో ఒత్తిడి నుంచి డిఫ్రెషన్ అందుకు కారణమైన ఒంటరితనం అన్నీ దూరం అవుతాయి.

Updated Date - 2022-10-25T11:40:28+05:30 IST