If Your Partner Is Overusing This Word: గమనించారా..? మీ రిలేషన్ బ్రేకప్ కావడానికి ముందు మీ భాగస్వామి మాటలు ఇలా ఉంటాయి....?

ABN , First Publish Date - 2022-08-26T17:24:35+05:30 IST

రిలేషన్ లో చీలికలు వస్తున్నయి అన్నప్పుడు ఆసంకేతాలు మాత్రం ముందే కనిపిస్తూ ఉంటాయి.

If Your Partner Is Overusing This Word: గమనించారా..? మీ రిలేషన్ బ్రేకప్ కావడానికి ముందు మీ భాగస్వామి మాటలు ఇలా ఉంటాయి....?

ఏదైనా రిలేషన్ నమ్మకం మీద నిలబడి ఉంటుంది. అందులో బ్రేకప్ లు గజిబిజిలు ఉన్నా కూడా ఆ నమ్మకమే తమ బంధాన్ని ముందుకు తీసుకువెళుతుంది. ఎన్ని అటంకాలు వచ్చినా వారి బంధం బలపడుతూనే ఉంటుంది. అయితే రిలేషన్ లో చీలికలు వస్తున్నాయి అన్నప్పుడు ఆసంకేతాలు మాత్రం ముందే కనిపిస్తూ ఉంటాయి. 


రిలేషన్ చివరి దశలో ఉందనే  విషయాన్ని చిన్న చిన్న సంకేతాలు ఎదుటివారు ఇస్తూనే ఉంటారు. ఇవి మరీ గమనిస్తేకానీ తెలియని మార్పులై ఉండకపోవచ్చు. మనతో మాట్లాడేటప్పుడు ఉపయోగించే ప్రతి పదం చాలా సార్లు తిప్పి చెపుతున్నట్టు అనిపిస్తుంది. చెప్పిన ఒక వాక్యంలో రెండు మూడు పదాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతాయట.


మీతో విడిపోవడానికి నెలలు లేదా సంవత్సరాలుగా వేచి ఉండవచ్చు...

ఈ రిలేషన్ లో ఉండాలా వద్దా అనేది మీతో చాలా కాలంగా చెప్పకపోవచ్చు. తమ మాటలతో, చేతలలో చెప్పాలని ప్రయత్నిస్తారు. ఇలాంటి వ్యక్తులు రెండు వేరు వేరు భవిష్యత్ లను ఊహించుకుంటూ జీవిస్తారు. మీ భాగస్వామి మీతో విడిపోవడానికి నెలల ముందు ఒక పదాన్ని ఎక్కువగా ఉపయోగించడం,. మామూలుగా మాటల్లో వచ్చే మనం అనే పదానికి నేను అనే పదాన్నే ఎక్కువగా వాడుతుంటారు. 


మీరు గమనిస్తే నిలదీయండి..నేను అనే పదంలోనే సంభాషణ సాగుతుంటే కనుక మీరే ఈ విషయాన్ని తెల్చుకుంటే మంచిది. మీ భాగస్వామి నేను అని  ఎక్కువగా ఉపయోగించడం మీకు నచ్చలేదని చెప్పేయండి. ఇది గమనించగానే తేల్చుకోవడం మంచిది. అనవసరంగా పరిస్థితిని పెద్దది చేసుకోకుండా ముందుగానే వారి మనసులోని అభిప్రాయాన్ని తెలుసుకుంటే పరిస్థితిని చక్కదిద్దే వీలు కలగచ్చు. అపోహలు తొలగిపోవచ్చు లేదా ఇద్దరూ స్నేహంగా విడిపోవచ్చు. 

Updated Date - 2022-08-26T17:24:35+05:30 IST