Relationship tips: ఎదుటివారి నుంచి తిరస్కరణ ఎదురైతే ఎలా తీసుకుంటారు? 3 దశల్లో తిరస్కారాన్ని అంగీకరించచ్చు.
ABN , First Publish Date - 2022-09-02T18:55:54+05:30 IST
తిరస్కరణకు గురికావడం అనేది జీవితంలో ఒక భాగం. దానిని మరీ లోతుగా తీసుకుని మిమ్మల్ని మీరు నిందించుకోవడం, గాయపరుచుకోవడం చేయకండి.
జీవితంలో అన్ని సందర్భాలలోనూ మనం అందరికీ నచ్చాలని లేదు. ప్రేమ విఫలం కావడం, ఇంటర్వ్యూలో సెలక్ట్ కాకపోవడం, బంధాలు దూరం కావడం, నచ్చిన వారు దూరం పెట్టడం ఇలా చాలా విషయాల్లో మనం తిరస్కరణకు గురవుతూనే ఉంటాం.
మన జీవితాల్లో తిరస్కరణలను ఎదుర్కుంటూనే ఉంటాం. ఒకరికి నచ్చడం, నచ్చకపోవడం అనేది మామూలుగా జరుగుతూనే ఉంటుంది. కానీ కొన్నిసార్లు అది ఎక్కువై కొందరు ఆందోళనకు, నిరాశకు గురి అవుతూ ఉంటారు. దీని నుంచి బయటపడటం చాలా అవసరం. తిరస్కరణను ఆరోగ్యవంతంగా ఎదుర్కోవాలి. లైఫ్ లో మరో దారిలో పయనించాలి కానీ అక్కడే ఆగిపోయి ఇంకా నిరాశలో కూరుకుపోకూడదు. దీని నుంచి బయట పడాలంటే ఈ మూడు దశలను దాటాలి. అవేంటో చూద్దాం.
తిరస్కరణను ఎదుర్కోవటానికి 3 దశలు అవేంటంటే..
1: తిరస్కరణ బాధను అంగీకరించాలి.
• ఎంత బాధ అయినా అనుభవించండి. దానికి వేరే దారులు వెతక్కండి.
• ఉద్యోగం రాలేదని కూడా ఎక్కువ ఆందోళన చెందక,. మరో దారిలో ఉద్యోగం పొందేలా ఆలోచించండి.
• ఇష్టపడిన వారు తిరస్కరించినా కూడా మనసును గట్టి చేసుకోవాలి.
• బాధగా, నిరాశగా, ఆందోళనగా ఉన్నప్పుడు స్నేహితులను కలవండి.
2: మనసులో భావాలను పేపర్ మీద పెట్టండి. అది మిమ్మల్ని కాస్త రిలీఫ్ పొందేలా చేస్తుంది.
• ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ లేకపోతే, సరిగ్గా అవగాహన లేకపోయినా ఇద్దరి మధ్యా బంధం సరిగా ఉండకపోవచ్చు. దానికి మిమ్మల్ని మీరు నిందించుకోకండి.
• నేను అందంగా లేను అనే భావనను వదిలేయండి.
3: కొత్తగా ఏమి నేర్చుకోవచ్చు అనే దానిపై దృష్టి పెట్టండి.
• అనుభవిస్తున్న బాధలోంచి చివరికి ఏం అనుభవం అయింది అది తెలుసుకోండి.
• ఈ తిరస్కారం నుంచి నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటి?
• ఈ తిరస్కారం తరువాత నేను భిన్నంగా ఏమి చేయగలను? అనే ప్రశ్నవేసుకోండి.
• తిరస్కరణకు గురికావడం అనేది జీవితంలో ఒక భాగం. దానిని మరీ లోతుగా తీసుకుని మిమ్మల్ని మీరు నిందించుకోవడం, గాయపరుచుకోవడం చేయకండి.