Stop Loving Someone : లవ్ ఫెయిల్యూరా? లైట్ తీస్కోండి.
ABN , First Publish Date - 2022-11-13T11:36:17+05:30 IST
ఇద్దరు లోతైన ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉంటారు.
ప్రేమ అనేది ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అనుభూతి. అది మనల్ని సంతోషంలోకి, అవ్యక్తమైన భావనలోకి మునిగిపోయేట్టు చేస్తుంది. ఇద్దరు లోతైన ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉంటారు. అదే ప్రేమ ఏకపక్షం అయితే అది ముందుకు సాగడం చాలా కష్టమే. ఇక ఒన్ సైడ్ లవ్ ఫెయిల్ అయితే హార్ట్ బ్రేక్ చేసేస్తుంది.
ప్రేమించడం మానేసి ముందుకు సాగడం ఎలా..
ఒకరిని ప్రేమించడంలో తలమునకలైనప్పుడు ఇష్టపడిన వారు ఏం చేసినా ఆరాధిస్తాం. వాళ్ళతో కలిసి సినిమా చూడాలని, కబుర్లు చెప్పాలని ఆలోచిస్తాం. తీరా ఇవన్నీ జరిగి ఇద్దరూ దగ్గరయ్యాం అనుకున్నాకా విడిపోవడం జరిగితే దానిని తట్టుకునే ధైర్యం కావాలి. ఇక ఒన్ సైడ్ లవ్ అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఎదుటివారితో ప్రేమను మొదట ఎలా అంగీకరించారో విఫలం అయినప్పుడు కూడా అలానే అర్థంచేసుకుని ధైర్యంగా ఆ ఫేజ్ ను దాటేయాలి.
1. సత్యాన్ని అంగీకరించాలి.
విఫలమైన సంబంధాలను అంగీకరించడం నేర్చుకోవాలి. కాకపోతే ఇది ఆచరించడం చాలా కష్టం. భావోద్వేగాలను ఆఫ్ చేసే బటన్ హృదయంలో లేదు. ప్రేమ అనేది ఒక సూక్ష్మమైన భావోద్వేగం.. వాస్తవాన్ని అంగీకరించడం బాధాకరమైనా దీని నుంచి ముందుకు సాగిపోవాలి.
2. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపండి.
స్నేహితులు, కుటుంబ సభ్యులు జీవితాంతం ఉన్నారు. ఎవరినైనా మరచిపోవాలని ప్రయత్నిస్తుంటే, స్నేహితులతో మాట్లాడండి. వాళ్ళతో కలిసి విహారయాత్రకు వెళ్లండి. ఇది మిమ్మల్ని మీరు నయం చేసుకోవడానికి సమయం.
3. టైమ్ హీల్ ఎవ్రీథింగ్..
'సమయం ప్రతిదానిని నయం చేస్తుంది' అనే ప్రసిద్ధ సామెత ప్రతి ఒక్కరూ నమ్మాలి. పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, మనం ఓపికగా ఉండాలి.