నెయిల్ పాలిష్ ఇలా...
ABN , First Publish Date - 2022-07-27T06:24:00+05:30 IST
బ్రష్‌ను బాటిల్‌లో ముంచి గోరు మీద రుద్దుకున్నంత మాత్రాన నెయిల్ పాలిష్ వేసుకున్న ఫలితం దక్కదు.
బ్రష్‌ను బాటిల్‌లో ముంచి గోరు మీద రుద్దుకున్నంత మాత్రాన నెయిల్ పాలిష్ వేసుకున్న ఫలితం దక్కదు. గోరు మీద రంగు సమంగా పరుచుకుని, మెరుపులీనాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.
బాటిల్‌ను అదే పనిగా కుదిపితే, నీటి బుడగలు ఏర్పడి గోరు మీద పరుచుకుంటాయి. కాబట్టి బాటిల్‌ను కదిలించాలి కానీ, విదిలించకూడదు.
బ్రష్‌ను బాటిల్‌లో ముంచి నేరుగా గోరు మీద అప్లై చేయకూడదు. ముంచిన బ్రష్‌ను బాటిల్ అంచులకు అద్ది, అదనపు రంగును ఒంపేయాలి.
మొదట గోరుకు రెండు చివర్లలో నిలువుగా నెయిల్ పాలిష్ వేసిన తర్వాత, మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని నింపాలి.
మొదట వేసిన కోటింగ్ పూర్తిగా ఆరిన తర్వాతే రెండవ కోట్ వేయాలి.
రంగు వేసిన గోళ్లను సహజసిద్ధంగా ఆరనివ్వాలి.
నెయిల్ పాలిష్ గట్టిపడిపోకుండా ఉండడం కోసం ఫ్రిజ్ డోర్‌లో ఉంచాలి.
గట్టి పడుతోందని అనిపిస్తే, కొన్ని చుక్కల అసిటోన్ కలుపుకోవచ్చు.