మెరుగైన ఆరోగ్యం కోసం ‘స్మార్ట్ స్నాకింగ్’
ABN , First Publish Date - 2022-06-24T01:44:23+05:30 IST
స్నాక్స్ అనగానే కొందరు విముఖత చూపుతారు. అవి బరువును పెంచుతాయని భావిస్తుంటారు. అంతేకాదు, అనారోగ్య
స్నాక్స్ అనగానే కొందరు విముఖత చూపుతారు. అవి బరువును పెంచుతాయని భావిస్తుంటారు. అంతేకాదు, అనారోగ్య సమస్యలకు అవి హేతువు అవుతాయని భయపడుతుంటారు. అయితే, చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. శరీరానికి అసవరమైన మినరల్స్, పోషకాలు శరీరానికి అందించేందుకు అదే సమర్థవంతమైన మార్గమని. కుటుంబ ఆరోగ్యాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు ఆరోగ్యవంతమైన స్నాకింగ్ ఆవశ్యకతను తెలుపుతూ ‘ఆల్మండ్ బోర్డ్ ఆఫ్ కాలిఫోర్నియా’ నేడు ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘స్మార్ట్ స్నాకింగ్ ఛాయిసెస్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఫ్యామిలీ హెల్త్’ (చక్కటి స్నాకింగ్ ఎంపికలు, కుటుంబ ఆరోగ్యంపై వాటి ప్రభావం) శీర్షికన నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్, న్యూట్రిషన్–వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి, మ్యాక్స్ హెల్త్‌కేర్ ఢిల్లీ రీజనల్ హెడ్ డైటెటిక్స్ రితికా సమద్దార్ పాల్గొన్నారు. ఈ చర్చకు మోడరేటర్‌గా ఆర్జే షెజ్జీ వ్యవహరించారు.
ఈ చర్చ ముఖ్యంగా కుటుంబ ఆరోగ్య సమస్యలపై జరిగింది. ఈ సమస్యలలో ప్రధానంగా ఊబకాయం, మధుమేహం, కార్డియోవాస్క్యులర్ వ్యాధులు, జీవనశైలి అంశాలు వంటివి ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను వెల్లడించిన ప్యానలిస్ట్‌లు ఇంటి వద్ద ఆలోచనాత్మకంగా తినడం ద్వారా కుటుంబ ఆరోగ్యం కూడా మెరుగపడుతుందన్నారు.
నటి సోహా అలీఖాన్ మాట్లాడుతూ.. భోజనానికి, భోజనానికి మధ్య ఆకలి వేయడం సర్వసాధారణమైన విషయమని, ఫాస్ట్ ఫుడ్స్‌ను తినడానికి అలవాటు పడిన కాలంలో ఇది మరింత సాధారణమై పోయిందన్నారు. పండ్లు, పెరుగు, గింజలు, విత్తనాలు, బాదములు లాంటివి నిల్వ చేయడానికి అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయని, వీటిని రోజంతా తినవచ్చని అన్నారు. షూటింగ్ సమయాలలో కూడా తాను బాదములు అందుబాటులో ఉంచుకుంటానని తెలిపారు.
రితికా సమద్ధార్ మాట్లాడుతూ.. ఒత్తిడితో కూడిన రోజువారీ కార్యకలాపాల కారణంగా ప్రజలు అనారోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారని అన్నారు. వండుకోవడానికి, లేదంటే తినడానికి అసలు సమయం చిక్కక పోవడం వల్ల ఫుడ్‌ను ఆర్డర్ చేసుకోవడం, లేదంటే అతి సులభంగా లభించే ప్యాకేజ్డ్ ఆహారాన్ని తినడం అలవాటు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే, ఇది అతి తీవ్రమైన ఆరోగ్య సమస్యలైనటువంటి బరువు పెరగడం, మధుమేహం, గుండె సమస్యలు రావడానికి కారణమవుతుందని హెచ్చరించారు. వీటికి బదులుగా పోషకాహారం అయిన బాదములు లాంటివి జోడించడం ద్వారా మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చన్నారు. కాబట్టి కుటుంబ ఆరోగ్య ప్రణాళికలో ఓ గుప్పెడు బాదాములను జోడించడం ద్వారా కుటుంబ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చిన సూచించారు.