Rashi Khanna: ఆ మాటంటే కోపం వస్తుంది!
ABN , First Publish Date - 2022-11-27T02:32:19+05:30 IST
కమర్షియల్ సినిమా అంటేనే.. హీరోయిజం. హీరో చుట్టూ తిరిగే కథలే అవన్నీ. కథానాయిక పాత్ర పేరుకు మాత్రమే.
కమర్షియల్ సినిమా అంటేనే.. హీరోయిజం. హీరో చుట్టూ తిరిగే కథలే అవన్నీ. కథానాయిక పాత్ర పేరుకు మాత్రమే. తన స్ర్కీన్ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఆ ఉన్న కాస్త సమయంలోనే తమదైన ముద్ర వేయడానికి కథానాయికలు పాటు పడుతుంటారు. అయితే.. స్ర్కీన్ స్పేస్ విషయంలో తనకెప్పుడూ ఎలాంటి అసంతృప్తులూ లేవని రాశీఖన్నా చెబుతోంది. ‘‘నేను ఎంత సేపు కనిపించాను? నాకు ఎన్ని పాటలు ఉన్నాయి? అనే లెక్కలేవీ నేను వేసుకోను. దర్శకుడు కథ చెబుతున్నప్పుడు నేను కనెక్ట్ అయితే చాలు. మరే విషయాన్నీ నేను ఆలోచించను. సినిమా అంతా నేనే ఉండాలన్న దురాశ నాకు లేదు. అలా కనిపించాలన్న తపన ఉంటే.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసుకోవొచ్చు. సినిమా అనేది ముమ్మాటికీ హీరో కోసమే. అందులో మాట మాటకు తావులేదు. ఆ తరవాతే ఏ పాత్ర అయినా. ‘ఈ సినిమాలో మీ పాత్ర నిడివి ఎంత’ అని ఎవరైనా అడిగితే నాకు కోపం వస్తుంది. పాత్రలో సత్తా ఉండాలి కానీ, నిడివితో పనేంటి? సినిమా అంతా కనిపించినా సరైన గుర్తింపు లేకపోతే.. ఉపయోగం ఏముంది? కొన్నిసార్లు ఒక్క సీన్ చాలు. ఒక్క డైలాగ్ చాలు. మనదైన ముద్ర వేయడానికి’’ అని చెప్పుకొచ్చింది.