Weight loss : బరువు తగ్గించే మెంతికూర!

ABN , First Publish Date - 2022-12-11T00:12:56+05:30 IST

ఆకుకూరల్లో మెంతికూర ప్రత్యేకం. పిండిపదార్థం అధికంగా ఉంటుంది. పప్పులో, ఇతర కూరల్లో వేసుకుని తినొచ్చు. మెంతి ఆకు ఫ్రై కూడా చేసుకోవచ్చు.

 Weight loss : బరువు తగ్గించే మెంతికూర!

  • ఆకుకూరల్లో మెంతికూర ప్రత్యేకం. పిండిపదార్థం అధికంగా ఉంటుంది. పప్పులో, ఇతర కూరల్లో వేసుకుని తినొచ్చు. మెంతి ఆకు ఫ్రై కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా కడుపులో గ్యాస్‌ సమస్యలు నివారించే గుణం మెంతికూరకు ఉంది. దీంతో పాటు తిన్న ఆహారం సాఫీగా జీర్ణం అవుతుంది.

  • ఎముకల ఆరోగ్యానికి మంచిది. దీంతో పాటు పాలిచ్చే అమ్మ తినాల్సిన ఆహారమిది.

  • కిడ్నీ, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొవ్వును తగ్గించి బరువు తగ్గేందుకు ఉపయోగపడే ఆకుకూర ఇది.

  • చర్మ ఆరోగ్యంతో పాటు జుట్టు కుదుళ్లు గట్టిగా ఉంటాయి.

  • మెంతికూరను ఎండబెట్టి కూడా కూరల్లో వేసుకోవచ్చు. మెంతులు వేసిన ఆహారం రుచిగా ఉంటుంది. మెంతి చపాతి చేసుకుని కూడా తినొచ్చు.

  • వీటిలో ఐరన్‌ ఉండటం వల్ల రక్తహీనతతో బాధపడేవారు తీసుకోవాలి.

  • మెంతికూరలో విటమిన్‌ ఎ, సి పుష్కలం. దీన్ని సెల్‌ డ్యామేజ్‌ అయ్యే అవకాశం తక్కువ. ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు.

Updated Date - 2022-12-11T00:12:57+05:30 IST