56ఏళ్ల మహిళతో 19ఏళ్ల కుర్రాడు సహజీవనం.. ఇక పెళ్లే ఆలస్యం..
ABN , First Publish Date - 2022-10-26T20:54:13+05:30 IST
ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మీద, ఎలా పుడుతుందో చెప్పలేం అనే డైలాగ్‌ను చాలా సార్లు సినిమాల్లో వినే ఉంటారు. కానీ ఓ ప్రేమ జంటను చూస్తే అది నిజమే కాబోలు అనిపిస్తుంది. ఎందుకంటే.. ఓ మహిళ తన కంటే 37ఏళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది. రెండేళ్లుగా సహజీవనం కూడా చేస్తోంది. త్వరలో..
ఎన్నారై డెస్క్: ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మీద, ఎలా పుడుతుందో చెప్పలేం అనే డైలాగ్‌ను చాలా సార్లు సినిమాల్లో వినే ఉంటారు. కానీ ఓ ప్రేమ జంటను చూస్తే అది నిజమే కాబోలు అనిపిస్తుంది. ఎందుకంటే.. ఓ మహిళ తన కంటే 37ఏళ్ల చిన్నవాడితో ప్రేమలో పడింది. రెండేళ్లుగా సహజీవనం కూడా చేస్తోంది. త్వరలో ఈ ప్రేమ జంట పెళ్లి పీటలెక్కబోతోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
జన్లా నముఆంగ్రాక్(Janla Namuangrak)కు ప్రస్తుతం 56ఏళ్లు. ఈ మహిళ తన కంటే 37ఏళ్లు చిన్నవాడైన వుతిచాయ్ చంతరాజ్ (Wuthichai Chantaraj) అనే కుర్రాడితో ప్రేమలో పడింది. గత రెండేళ్లుగా సహజీవనం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ఈ మధ్యే నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. త్వరలోనే ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. జన్లాకు గతంలో వివాహం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల చాలా ఏళ్ల క్రితమే విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం ఆమెకు 20-30ఏళ్ల మధ్య వయసు ఉన్న ముగ్గురు పిల్లలు ఉన్నారు.
తొమ్మిదేళ్ల క్రితం పరిచయం..
జన్లా, పుతిచాయ్.. ఇద్దరూ థాయ్‌లాండ్(Thailand)లోని సఖోన్ నఖోన్ ప్రావిన్స్‌లో ఒకే ప్రాంతంలో నివసించేవారు. 10ఏళ్ల వయసులో పుతిచాయ్.. తరచూ జన్లా ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఇంటి పనుల్లో ఆమెకు సహాయం చేస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. తర్వాత స్నేహంగా మారింది. ఆ స్నేహమే తర్వాత ప్రేమగా మారింది. కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ ఇద్దరూ.. రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఈ ప్రేమ జంట ఇంటర్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా పుతిచాయ్ మాట్లాడుతూ.. ‘ఆమె కష్టపడి పని చేసే మహిళ. అంతేకాకుండా నిజాయితీపరురాలు కూడా. అందుకే ఆమె అంటే నాకు చాలా ఇష్టం’ అని అన్నాడు. ఇక జన్లా మాట్లాడుతూ.. ‘అతడు తనకు సూపర్ హీరో’ అంటూ చెప్పుకొచ్చింది. చుట్టుపక్కల వాళ్ల మాటలు పట్టించుకోబోమని ఈ సందర్భంగా ఈ ప్రేమ జంట స్పష్టం చేసింది. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్తున్నట్టు చెప్పుకొచ్చింది.