వైట్‌హౌస్‌లో దీపావళి.. భారతీయ అమెరికన్‌ పిల్లలను స్వయంగా ఆహ్వానించిన బైడెన్‌

ABN , First Publish Date - 2022-10-27T08:31:43+05:30 IST

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌ్‌సలో సోమవారం నిర్వహించిన దీపావళి వేడుకలకు ముగ్గురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముగ్గురు యువ భారతీయ-అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా ఆహ్వానించారు. దీనిద్వారా డిఫర్డ్‌ యాక్షన్‌

వైట్‌హౌస్‌లో దీపావళి.. భారతీయ అమెరికన్‌ పిల్లలను స్వయంగా ఆహ్వానించిన బైడెన్‌

వాషింగ్టన్‌, అక్టోబరు 26: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌ్‌సలో సోమవారం నిర్వహించిన దీపావళి వేడుకలకు ముగ్గురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముగ్గురు యువ భారతీయ-అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా ఆహ్వానించారు. దీనిద్వారా డిఫర్డ్‌ యాక్షన్‌ లీగల్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌ (డీఏఎల్‌సీఏ) పిల్లలకు సంఘీభావం తెలుపుతున్న సందేశాన్ని ఆయన అందించారని భావిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలసి అమెరికా వెళ్లి, అక్కడ నివసించడానికి తగిన పత్రాలు లేని పిల్లలు డీఏసీఎల్‌ఏలో ఉన్నారు. వీరిని ఎప్పుడైనా అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుంది. డీఏఎల్‌సీఏ పిల్లల తరఫున పోరాడుతున్న ‘ఇంప్రూవ్‌ ద డ్రీమ్‌’ సంస్థ వ్యవస్థాపకుడు దీప్‌ పటేల్‌తోపాటు పరీన్‌ మహత్రే, అతుల్య రాజ్‌కుమార్‌ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు కమలా హారి్‌సతో కలసి దీపావళి వేడుకల్లో పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-10-27T08:31:47+05:30 IST