Indian-American Boy: గోల్డెన్ గేట్ బ్రిడ్జీపై నుంచి దూకి బాలుడి మృతి

ABN , First Publish Date - 2022-12-15T08:02:46+05:30 IST

భారతీయ అమెరికన్ యువకుడు శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్ గేట్ వంతెనపై నుంచి దూకి మరణించినట్లు...

Indian-American Boy: గోల్డెన్ గేట్ బ్రిడ్జీపై నుంచి దూకి బాలుడి మృతి
Golden Gate Bridge

శాన్ ఫ్రాన్సిస్కో(అమెరికా): భారతీయ అమెరికన్ యువకుడు శాన్ ఫ్రాన్సిస్కోలోని ప్రసిద్ధ గోల్డెన్ గేట్ వంతెనపై నుంచి దూకి మరణించినట్లు అతని తల్లిదండ్రులు, యూఎస్ కోస్టల్ గార్డ్స్ అధికారులు తెలిపారు.(Golden Gate Bridge)వంతెనపై 16 ఏళ్ల బాలుడి సైకిల్, ఫోన్, బ్యాగ్ లభ్యమయ్యాయి. పన్నెండవ తరగతి చదువుతున్న విద్యార్థి (Indian American Boy)బుధవారం సాయంత్రం 4.58 గంటల ప్రాంతంలో వంతెనపై నుంచి దూకి ఉంటాడని భావిస్తున్నారు. బాలుడు వంతెనపై నుంచి దూకిన రెండు గంటల తర్వాత యూఎస్ కోస్టల్ గార్డ్స్ గాలింపు చేపట్టారు.

ఒక భారతీయ అమెరికన్ గోల్డెన్ బ్రిడ్జిపై నుంచి దూకి(Jumps Off) ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం నాల్గవ ఘటనగా ఎన్నారై అజయ్ జైన్ భూటోరియా చెప్పారు.గోల్డెన్ బ్రిడ్జీపై గత ఏడాది 25 మంది తమ జీవితాలను ముగించారు. 1937వసంవత్సరంలో వంతెన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 2వేలమంది ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి.ఆత్మహత్య ఘటనలతో 1.7 మైళ్ల వంతెనకు ఇరువైపులా 20 అడుగుల వెడల్పుతో ఇనుప మెష్‌ను రూపొందించేందుకు యూఎస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Updated Date - 2022-12-15T08:38:44+05:30 IST