Home » NRI
Sri Seetharamula Kalyanam: సీతారాముల కల్యాణోత్సవం డెన్మార్క్‌లో కన్నుల పండువగా జరిగింది. గత ఆదివారం డెన్మార్క్‌లోని తెలుగు భక్తులు అంతా ఒక దగ్గర చేరి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
NRI TDP: ఛార్లెట్‌లో ఎన్నారై టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. చార్లెట్లోని వెడ్డింగ్టన్ రోడ్డులో ఉన్న బావార్చి ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్ లో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు అందిస్తున్న సేవలను నేతలు కొనియాడారు.
NRI: నెల నెల తెలుగు వెన్నెల కార్యక్రమం ప్రతి మాసం చివరి ఆదివారం నిర్వహిస్తారు. మార్చి 30వ తేదీ చివరి ఆదివారం ఉగాది పర్వదినం కూడా రావడంతో.. “రైతన్నా! మానవజాతి మనుగడకు మూలాధారం నీవేనన్నా” అంశంపై చర్చ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 30 మంది కవులు పాల్గొన్నారు.
NRI: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో 15వ రక్తా దాన కార్యక్రమం విజయంగా జరిగింది. స్థానిక డీఎఫ్‌డబ్ల్యు మెట్రో ఏరియాలోని ఐటీ స్పిన్ కంపెనీ ప్రాంగణంలో ఈ శిబిరాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 80 మంది హాజరయ్యరు.
అమెరికా విదేశాంగ శాఖ, క్యాంపస్ ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులకు ఈ-మెయిల్స్ పంపింది, వారితో పాటు జాతి వ్యతిరేక సందేశాలు షేర్ చేసినవారికి కూడా హెచ్చరికలు జారీ చేయబడినట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం, 300 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి.
అమెరికా దేశం డల్లాస్‌లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 212వ సాహిత్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈసారి డయాస్పోరా కథల పరిణామం అనే అంశంపై నిర్వహించిన సభ ఆద్యంతం ఉత్సహ భరితంగా సాగింది.
ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు. తానా 24వ ద్వైవార్షిక మహాసభలకు ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను తానా ప్రతినిధులు ఆహ్వానించారు.
ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో గత ఐదేళ్లుగా ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” కార్యక్రమంలో భాగంగా ఈనెల ఆఖరి ఆదివారం 77వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “నా భాషే నా శ్వాస” అంశంపై నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాతృభాష మాదుర్యాన్ని తెలియజేశారు.
Nela Nela Telugu Vennela: విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ మంగారి రాజిందర్ మాట్లాడుతూ.. తాను వివిధ కోర్టుల్లో ఇచ్చిన తీర్పులతోపాటు తన అనుభవాల సమాహారంలో తెలుగులో పలు కథలు రచించారు. ఆ క్రమంలో తన కథా రచన వైశిష్ట్యాన్ని సైతం ఆయన తెలియజేశారు. ముఖ్యంగా ఆయన రచించిన రచనలు.. నేనూ నా నల్లకోటు, మనసు పెట్టి, కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు, మా వేములవాడ కథలులో రాసిన కథలు.. జన జీవనంలో విభిన్న పాత్రలతో రూపొందించానని వివరించారు.
మనిషి జీవనయానంలో ఎన్నో మజిలీలు. ఉద్యోగ విరమణ అయిన తర్వాత గడిపే కాలాన్ని ‘గోల్డెన్ ఇయర్స్’ అంటారు. ఎందుకంటే ఆదరాబాదరా లేకుండా, ప్రతీ నిమిషాన్ని ఆస్వాదిస్తూ, తమకోసం తాము జీవించే బంగారు కాలం అదే కాబట్టి. గోల్డెన్ ఇయర్స్‌లో ఉన్నవారికి ‘రిటైర్మెంట్ వీసా’ ఇస్తామంటూ ఆహ్వానిస్తున్నాయి కొన్ని దేశాలు. సోషల్ మీడియాలో ఇప్పుడిదో ట్రెండ్.