మహిళల జైల్లో గర్భం దాల్చిన ఇద్దరు ఖైదీలు..ఏం చేయాలో తెలీక తల బాదుకుంటున్న అధికారులు..!

ABN , First Publish Date - 2022-04-16T02:35:43+05:30 IST

అది అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో గల జైలు. అక్కడ కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. పురుషులకు అసలు అనుమతే లేని ఆ జైల్లోని ఇద్దరు మహిళా ఖైదీలు గర్భం దాల్చారు.

మహిళల జైల్లో గర్భం దాల్చిన ఇద్దరు ఖైదీలు..ఏం చేయాలో తెలీక తల బాదుకుంటున్న అధికారులు..!

ఎన్నారై డెస్క్: అది అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో గల జైలు. అక్కడ కేవలం మహిళలు మాత్రమే ఉంటారు. పురుషులకు అసలు అనుమతే లేని ఆ జైల్లోని ఇద్దరు మహిళా ఖైదీలు గర్భం దాల్చారు. దీనికి కారణం ఓ ట్రాన్స్ జెండర్ మహిళ. అదే జైల్లో ఖైదీగా ఉన్న ఆ ట్రాన్స్ జెండర్ మహిళల.. ఆ ఇద్దరు ఖైదీలతో శృంగారంలో పాల్గొనడంతో వారు ప్రెగ్నెంట్ అయినట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో..  ఏం చేయాలో పాలుపోక జైలు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. 


జైలు నిబంధనలే ఈ పరిస్థితికి దారి తీసాయి. వీటి ప్రకారం.. తాము పురుషులమని భావించేవారు పురుషుల జైల్లో.. మహిళలమని నమ్మేవారు మహిళల జైల్లో ఉండేందుకు హక్కు ఉంది. ఈ క్రమంలో డెమీ మైనర్ అనే ట్రాన్స్ జెండర్ తాను మహిళల జైల్లోనే ఉంటానని చెప్పుకొచ్చింది. దీంతో.. జైలు అధికారులు ఇందుకు అంగీకరించారు. అయితే అప్పటికి ఆ ట్రాన్‌జెండర్‌కు లింగ మార్పిడి ఆపరేషన్ జరగలేదు. ఈ క్రమంలో ఆ ఇద్దరు ఖైదీలతో ట్రాన్స్ జెండర్  మహిళ శారీరకంగా కలవడంతో వారు గర్భవతులయ్యారు. అయితే.. ఇదంతా పరస్పర ఆమోదంతోనే జరిగిందని ఇద్దరు మహిళా ఖైదీలు స్పష్టం చేశారు. అంధకారమైపోయిన తమ జీవితాల్లో వెలుగు రేఖలా ప్రేమ భావన ప్రవేశించని పేర్కొన్నారు. క్లింటన్‌లోని ఎడ్నా మహన్ కరెక్షనల్ ఫెసిలిటీలో ఈ ఘటన వెలుగు చూసింది. 

Updated Date - 2022-04-16T02:35:43+05:30 IST