NRI: కోటీశ్వరుడైపోయిన ఎన్నారై.. రెండేళ్ల పాటు వరుసగా ఇలా చేయడంతో..
ABN , First Publish Date - 2022-11-10T21:24:20+05:30 IST
రెండేళ్ల పాటు వరుసగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసిన దుబాయి ఎన్నారై ఎట్టకేలకు అదృష్టాన్ని చేజిక్కించుకున్నాడు.
ఎన్నారై డెస్క్: రెండేళ్ల పాటు వరుసగా లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసిన దుబాయి ఎన్నారై(Dubai NRI) ఎట్టకేలకు అదృష్టాన్ని చేజిక్కించుకున్నాడు. 2020 తరువాత తొలిసారిగా.. బిగ్ టికెట్ లైవ్ డ్రా(Big ticket live draw) లాటరీలో సీరిస్ 245 జాక్ పాట్ కొట్టేశాడు. రెండేళ్ల క్రితం సాజేశ్(Sajesh).. ఒమాన్ నుంచి యూఏఈకి మారాడు. అక్కడే ఓ భారతీయ హోటల్‌లో పనిచేస్తున్నాడు. 20 మంది సహోద్యోగులతో కలిసి అతడు కొన్న టిక్కెట్‌కు జాక్‌పాట్(Jackpot) తగిలింది. ఈ డబ్బును వారందరూ సరిసమానంగా పంచుకోనున్నారు. కాగా.. తన వాటాగా వచ్చిన సొమ్ముతో మిగిలిన కోలీగ్స్‌కు వీలైనంతగా సాయపడతానని సాజేశ్ తెలిపాడు.‘‘నేను పని చేసే హోటల్‌లో 150 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్లల్లో నాకు వీలైనంత మందికి సాయం చేస్తాను. నాకు దక్కిన మొత్తంలో కొంత వారితో పంచుకుంటాను’’ అని సాజేశ్ చెప్పాడు. ఇక భవిష్యత్తులోనూ ఇదే తీరులో తాను లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేస్తానని తెలిపాడు. ఇక తదుపరి లాటరీ డ్రా డిసెంబర్‌లో నిర్వహిస్తారు. ఈ జాక్ పాట్ కొట్టిన వ్యక్తి ఏకంగా 30 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకుంటాడు.
జర్మనీకి చెందిన ఓ వ్యక్తి కూడా ఇటీవలే లాటరీలో 81 కోట్లు గెలుచుకున్నాడు. స్టీల్ ప్లాంట్‌లో పని చేసే అతను లాటరీ గెలవగానే ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఆ తరువాత.. లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ‘‘ప్రస్తుతం నేను ఒంటరినే. నాకో తోడు దొరికితే ఆమెతో కలిసి.. లైఫ్ ఎంజాయ్ చేయాలనుంది’’ అని అతడు స్థానిక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘‘ఆమె ఎవరైనా సరే.. నాతో పాటూ పర్యటనలు చేసేందుకు.. కుటుంబ జీవితం ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంటే చాలు’’ అంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు.
ఇవీ చదవండి: కెనడాలో జాబ్.. కొత్త ఉద్యోగంలో చేరిన 2 రోజులకే భారీ షాక్..!