తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ABN , First Publish Date - 2022-10-08T20:56:36+05:30 IST
తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. దాదాపు 1200 మందికిపైగా కెనడాలోని తెలంగాణ వాసులు స్థానిక Oakville Legacy Banquet & Convention centre -Oakvilleలో జరిగిన సంబరాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశా
ఎన్నారై డెస్క్: తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో టొరంటో నగరంలోని తెలంగాణ ప్రాంత వాసులు బతుకమ్మ సంబరాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. దాదాపు 1200 మందికిపైగా కెనడాలోని తెలంగాణ వాసులు స్థానిక Oakville Legacy Banquet & Convention centre -Oakvilleలో జరిగిన సంబరాల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం తొలుత అసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వర్ ఈద, గవర్నింగ్ బోర్డు ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీప గజవాడ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈ కార్యక్రమములో TCA అతిపెద్ద (దాదాపు 6 అడుగుల) బతుకమ్మను తయారు చేసింది. దీని చుట్టు మహిళలు బతుకమ్మ ఆడిన తీరు వీక్షకులను ఆకట్టుకుంది.
బతుకమ్మ ఆట సుమారు 6 గంటల వరకు ఏకధాటిగా కొనసగగా.. మగువలు, చిన్నారులు సందడి చేశారు. చివరకు ‘పోయిరావమ్మ బతుకమ్మ, పోయిరావమ్మ గౌరవమ్మ అనే పాటతో ఊరేగింపుగా వెళ్లి నిమజ్జనం పూర్తి చేశారు. అనంతరం సత్తుపిండి, నువ్వుల పిండి, పల్లీల పండిని ఫలహారాలుగా పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో పలు వంటకాలతో potluck డిన్నర్‌ను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుత కమిటీ అధ్యక్షుడు రాజేవ్వర్.. నూతన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, కొత్త గవర్నింగ్ బోర్డు టీంను(2022-24 కాలానికి) వేదికపైకి పిలిచి సభకు పరిచయం చేశారు. అనంతరం వారికి అభినందలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి ఈవెంట్ కో స్పాన్సర్స్‌గా పబ్బ రియాల్టీ నుంచి శ్రీనివాస్ పబ్బ, శ్వేతా పుల్లూరి, Townhill కన్స్ట్రక్షన్, లవ్ ప్రీత్ టీం, మరియు Get-Home Realty నుంచి ప్రశాంత్ మూల, Remax నుంచి మానస్వని వేళాపాటి, హోమ్ లైఫ్ లాండ్మార్క్ ఇంక్. బ్రోకరేజ్ రియాల్టీ నుంచి రికెల్ హూంగే, బెస్ట్ బ్రైన్స్ లెర్నింగ్ సెంటర్-OAKVILLE లు వ్యవరించగా ప్రెసిడెంట్ రాజేశ్వర్ ఈద ఆయా ప్రతినిధులను శాలువాలతో అభినందించి మొమెంటోస్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, జనరల్ సెక్రెటరీ దామోదర్ రెడ్డి మాది, ట్రెజ్రెరర్ నవీన్ ఆకుల మరియు కల్చరల్ team దీప గజవాడ, మరియు కార్యవర్గ సభ్యులు, గిరిధర్ క్రోవిడి, ఉదయ భాస్కర్ గుగ్గిళ్ల, రాహుల్ బాలినేని, ధాత్రి అంబటి, బోర్డు ఆఫ్ ట్రస్టీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి దేప, రాజేష్ ఆర్రా, ప్రకాష్ చిట్యాల, మనోజ్ రెడ్డి, సంస్థ ఫౌండేషన్ కమిటీ సభ్యులు కోటేశ్వర రావు చిత్తలూరి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస్ తిరునగరి,శ్రీనాథ్ కుందూరి తదితరులు పాల్గొన్నారు.