California: ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం...విద్యుత్ సరఫరాలో అంతరాయం
ABN , First Publish Date - 2022-12-21T06:21:38+05:30 IST
ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూకంపం సంభవించింది....
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని యురేకా ప్రాంతంలో భూకంపం సంభవించింది.(Northern California) మంగళవారం సంభవించిన భూకంపం(Earthquake) తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది.ఈ భూకంపం వల్ల ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.భూకంపం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం వాటిల్లింది.భూప్రకంపనలతో కొన్ని భవనాలు,రోడ్లు ధ్వంసం అయ్యాయని యూఎస్ జియోలాజికల్ సర్వే(US Geological Survey) తెలిపింది.ఈ భూకంపం కాలిఫోర్నియా నివాసితులకు నిద్రను దూరం చేసింది.
భూకంప కేంద్రం కాలిఫోర్నియా అటవీప్రాంత రెడ్‌వుడ్ కోస్ట్‌లో భాగమైన హంబోల్ట్ కౌంటీ అని యూఎస్ అధికారులు చెప్పారు.గత ఏడాది డిసెంబరు 20వతేదీన హంబోల్ట్ కౌంటీలోని కేప్ మెండోసినోలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రధాన భూకంపం వల్ల తీరప్రాంత ఒరెగాన్ నుంచి కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌కు దక్షిణం వరకు జనం తీవ్ర భయాందోళనలు చెందారు.ఈ భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.