OHRK: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రోమో!
ABN , First Publish Date - 2022-12-02T22:03:46+05:30 IST
అన్న వదినలతో అనుబంధం? అన్నయ్య లేకపోవడంతో వెలితిగా ఉందా? ఎప్పుడైనా మనస్పర్థలు వచ్చిన సందర్భాలున్నాయా? ఎన్టీఆర్–కృష్ణల మధ్య వివాదానికి కారణం? విజయనిర్మలతో కృష్ణ పెళ్లి...
అన్న వదినలతో అనుబంధం? (Ghattamaneni Adi seshagirirao )
అన్నయ్య లేకపోవడంతో వెలితిగా ఉందా?
ఎప్పుడైనా మనస్పర్థలు వచ్చిన సందర్భాలున్నాయా?
ఎన్టీఆర్–కృష్ణల మధ్య వివాదానికి కారణం?
విజయనిర్మలతో కృష్ణ పెళ్లి..(Open heart with rk)
రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన ఉందా?
ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు?
కృష్ణ సోదరుడు, (superstar krishna)నిర్మాత ఘట్టమనేని ఆది శేషగిరిరావు ఏం చెప్పారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఆదివారం రాత్రి 8.30 నిమిషాలకు ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమం చూడాల్సిందే. తాజాగా ఆదిశేషగిరిగారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ‘‘అన్నయ్య మనసులో బాధ ఉన్నా ఎప్పుడూ ఎవరితో షేర్ చేసుకునేవారు కాదు. నవ్వుతూనే కనిపిస్తారు. వదిన ఇందిరమ్మ మరణం తర్వాత మొదటిసారి తన బాధనునాతో షేర్ చేసుకున్నారు’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు ఆదిశేషగిరిరావు.
అన్నయ్యతో ఏమన్నా మనస్పర్థలు వచ్చాయా? అన్న ప్రశ్నకు ‘‘మూడేళ్ల వయసులో సైకిల్ మీద సినిమాకు తీసుకెళ్లడం నుంచి అన్నయ్యతో నాకు చాలా జ్ఞాపకాలున్నాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండటమే తెలుసు. 1970ల్లోనే కుటుంబ బాధ్యతలు నాకు అప్పగించారు. పిల్లలకి ఏం కావాలన్నా నన్నే అడిగేవారు. అన్నయ్యతో నాకు ఉన్నవన్నీ మంచి జ్ఞాపకాలే! సినిమాల్లో నటించాలనే కోరిక కలగలేదనీ, వాళ్లు పడే కష్టాలు చూసి వద్దనుకున్నా. నిర్మాతగానే కొనసాగాను’’ అని చెప్పారు.
ఎన్టీఆర్‌తో వివాదం గురించి చెబుతూ ‘‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చివర్లో మా రాబోవు చిత్రం అల్లూరి సీతారామరాజు’ అని టైటిల్ వేశాం. ‘ఈ సినిమా తీయాలనుకుంటున్నాం అని ఎన్టీఆర్‌తో చెప్పాను. మీరు తీస్తే మేం ఆపేస్తామని’ కూడా అన్నాను. ‘నేను తీయను.. మీరు తీయద్దు’ అన్నారు. అక్కవ వివాదం మొదలైంది. రాజకీయాల్లోనూ ఇద్దరికీ కాస్త భిన్నాభిప్రాయాలున్నాయి. తర్వాత ఇద్దరూ బాగానే కలిసిపోయారు.
రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదు. ఇప్పటి రాజకీయాలు దిగజారిపోయాయి.
మా విషయాల్లో విజయ నిర్మల జోక్యం చేసుకోలేదు. మేం ఆవిడ విషయంలో జోక్యం చేసుకోలేదు.