‘మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దు’
ABN , First Publish Date - 2022-10-22T19:19:07+05:30 IST
విశాఖలో, పవన్ కళ్యాణ్ పర్యటనపై అధికార పార్టీ కక్ష్య పూరితంగా వ్యవహరించిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై అక్రమంగా కేసులు పెట్టి, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుందని, ప్రభుత్వం పిరికి పందలా వ్యవహరిస్తోందన్నారు.
అమరావతి: విశాఖలో, పవన్ కళ్యాణ్ పర్యటనపై అధికార పార్టీ కక్ష్య పూరితంగా వ్యవహరించిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివ శంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై అక్రమంగా కేసులు పెట్టి, మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తుందని, ప్రభుత్వం పిరికి పందలా వ్యవహరిస్తోందన్నారు. రాజ్యాంగం ఈ ప్రభుత్వానికి తెలియదు..పులివెందుల రాజ్యాంగం నడుస్తుందన్నారు. అధికారులు పాలకులకు బొచ్చు కుక్కలగా పని చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఈ పాలన వల్ల ఎంతో నష్టపోతున్నారని ఆదేదన వ్యక్తం చేశారు. సెక్షన్ 30 అమలులో ఉన్నప్పుడు వైసీపీ నేతలు గర్జన ఎలా చేశారని అన్నారు. తమ మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకోకండని, అది చాలా ప్రమాదం అన్నారు. జనసేన 24 ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తామన్నారు.