Viral Video: ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాహనాలు ఎలా వెళ్తున్నాయో చూడండి.. ఇది ఎక్కడో తెలిస్తే..!
ABN , First Publish Date - 2022-12-04T16:00:38+05:30 IST
భారతీయులు ట్రాఫిక్ నిబంధనలను పాటించరని, అందువల్లే భారతీయ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఎక్కువని విదేశీయులు అంటూ ఉంటారు. నిజమే.. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌ను ఛేదించి ఇంటికి చేరడమనేది పెద్ద ఫీట్. ఇక, ఇరుకు రోడ్లలో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. అయితే..
భారతీయులు ట్రాఫిక్ నిబంధనలను పాటించరని, అందువల్లే భారతీయ నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు చాలా ఎక్కువని విదేశీయులు అంటూ ఉంటారు. నిజమే.. బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్‌ను ఛేదించి ఇంటికి చేరడమనేది పెద్ద ఫీట్. ఇక, ఇరుకు రోడ్లలో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. అయితే మిజోరాంలోని ఐజ్వాల్‌లో ఓ ఇరుకు రోడ్డుపై వాహనాలన్నీ ఓ క్రమ పద్ధతిలో వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
మిజోరాంలోని ఐజ్వాల్ నగరంలోని ఓ ఇరుకు రోడ్డుపై కార్లు, బైక్‌లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక లైన్లో వెళుతుండటం నెటిజన్లను ఆబ్బురపరుస్తోంది. కార్లు, బైక్‌లు వేర్వేర్లు లేన్స్‌పై వెళుతుండటం, ఒక వాహనం మరో వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించకపోవడం ఈ వీడియోలో గమనించవచ్చు. అలాగే బైక్‌లపై వెళ్తున్న అందరూ హెల్మెట్లు పెట్టుకున్నారు. ఐజ్వాల్‌లో ప్రతి ఒక్కరూ తమ వంతు వచ్చే వరకూ సహనంతో వేచిచూస్తారని, ప్రతి భారత నగరంలోనూ దీన్ని పాటించాలని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2.6 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు భారీ సంఖ్యలో స్పందించారు. ట్రాఫిక్ జామ్స్‌ను నివారించేందుకు భారతీయ నగరాలన్నీ ఈ ట్రాఫిక్ మోడల్‌ను అనుసరించాలని కామెంట్లు చేశారు. అలాగే ఇండియన్ సైలెంట్ సిటీ ఐజ్వాల్ అంటూ ప్రశంసిస్తున్నారు.