Smart Phones Export: చైనాకు దెబ్బ.. భారత్‌కు తరలి రానున్న చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు.. అదే జరిగితే..
ABN , First Publish Date - 2022-12-10T20:20:08+05:30 IST
స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీలో మనదేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే రోజులు ఎంతో దూరంలో లేవు. యాపిల్, సామ్‌సంగ్ బాటలోనే చైనీస్ బ్రాండ్‌లు కూడా భారత్‌లోనే తయారీని (Smart Phone Production) ప్రారంభించి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
స్మార్ట్‌ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తయారీలో మనదేశం గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే రోజులు ఎంతో దూరంలో లేవు. యాపిల్, సామ్‌సంగ్ బాటలోనే చైనీస్ బ్రాండ్‌లైన Xiaomi, Oppo, Vivo వంటి స్మార్ట్‌ఫోన్ సంస్థలు భారత్‌లోనే తయారీని (Smart Phone Production) ప్రారంభించి ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మేకిన్ ఇండియా (Make in India) ప్రోగ్రామ్ ద్వారా దేశంలో పరిశ్రమల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు, కొత్త పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఇప్పటికే యాపిల్, శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించి ఇతర దేశాలకు ఎగుమతి (Smart Phones Export) చేస్తున్నాయి. ఇక, ఎక్కువ ఆదరణ కలిగి, షియోమీ, ఒప్పో, వివో వంటి సంస్థల ఉత్పత్తి కూడా భారత్‌లో ప్రారంభమైతే ఇప్పటివరకు ఎలక్ట్రానిక్ హబ్‌గా ఉన్న చైనాకు పెద్ద దెబ్బే. ఈ ఏడాది భారత్ నుంచి 8.5 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు జరగబోతున్నాయి. 2025-26 నాటికి భారత్ నుంచి 60 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు జరపాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది.
యాపిల్, శాంసంగ్ వంటి సంస్థలు భారత్‌లోనే మొబైళ్లను తయారు చేస్తూ PLI Scheme ద్వారా ప్రయోజనాలు పొందుతున్నాయి. చైనా కంపెనీలు (China Smart Phone brands) కూడా తమ ఉత్పత్తులకు భారత్‌ను కేంద్రంగా చేసుకుని ఆ ప్రయోజనాలు పొందేందుకు సిద్ధమవుతున్నాయి. చైనాలో కోవిడ్ ఆంక్షలు, భారత్ ప్రోత్సాహం వెరిసి మొబైల్ సంస్థలు భారత్ వైపు చూపు సారించాయి.