మీకు Punjab National Bank లో అకౌంట్ ఉందా..? డిసెంబర్ 12 లోపే ఈ పనులు చేసేయండి.. లేకుంటే..

ABN , First Publish Date - 2022-11-28T16:04:37+05:30 IST

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంకులో (Punjab National Bank) అకౌంట్ ఉందా? అయితే త్వరపడండి.. వచ్చే డిసెంబర్ 12వ (December 12) తేదీ లోపు మీ కేవైసీ (KYC Update) వివరాలను అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే సమస్యలు తప్పవు.

మీకు Punjab National Bank లో అకౌంట్ ఉందా..? డిసెంబర్ 12 లోపే ఈ పనులు చేసేయండి.. లేకుంటే..

డిసెంబర్ 12వ (December 12) తేదీ లోపు మీ కేవైసీ (KYC Update) వివరాలను అప్‌డేట్ చేసుకోండి. లేకపోతే సమస్యలు తప్పవు. ఈ మేరకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఓ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే కేవైసీకి సంబంధించిన మెసేజ్‌లను ఖాతాదారుల మొబల్స్‌కు పంపామని, కొందరికి పోస్ట్ ద్వారా తెలియజేశామని పీఎన్‌బీ తెలిపింది.

ఇప్పటికే కేవైసీ అప్‌డేట్ చేసుకున్న వారికి ఎలాంటి సమస్యా ఉండదు. అప్‌డేట్ చేసుకోని వారికి మాత్రం డిసెంబర్ 12వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. అప్పటికీ అప్‌డేట్ చేసుకోని వారి ఖాతాలపై పలు ఆంక్షలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. కాబట్టి, ఆ ప్రక్రియ పూర్తి చేయని ఖాతాదారులు డిసెంబర్ 12వ తేదీ లోపు తమ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి సంబంధిత పత్రాలు సమర్పించి తమ కేవైసీని అప్‌డేట్ చేయించుకోవాలి. తమ కేవైసీ పెండింగ్‌లో ఉందా? లేదా? అనే విషయం తెలుసుకునేందుకు పీఎన్‌బీ ఖాతాదారులు 1800 180 2222/1800 103 2222 అనే టోల్‌ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.

Updated Date - 2022-11-28T16:04:39+05:30 IST