Viral Video: నువ్వు చిరుత అయితే.. నేను కోతి.. వీడియో చూసి తెగ నవ్వేస్తున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2022-11-26T11:15:55+05:30 IST

ఓ కోతి, చిరుతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు.. కడుపుబ్బా నవ్వుకుంటున్నారు..

Viral Video: నువ్వు చిరుత అయితే.. నేను కోతి.. వీడియో చూసి తెగ నవ్వేస్తున్న నెటిజన్లు!

ఇంటర్నెట్ డెస్క్: ఇంటర్నెట్, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే క్షణాల్లో అంతటా తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే ఓ కోతి, చిరుతకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు.. కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆకలేసి ఎప్పటిలాగే ఓ చిరుత వేట కోసం బయల్దేరింది. ఈ క్రమంలోనే దాని కంట ఓ కోతి పడింది. దీంతో దాన్ని వెంబడించింది. కోతి పక్కనే ఉన్న చెట్టెక్కడంతో.. చిరుత కూడా చెట్టెక్కేసింది. దీంతో కోతి చిటారు కొమ్మపైకి జంప్ చేసింది. ఈ క్రమంలో చిరుత సైతం కోతిని పట్టుకోవడానికి ఆ చిటారు కొమ్మవైపు వెళ్లబోయింది. అది గమనించిన కోతి.. మరో చిటారు కొమ్మవైపునకు జంప్ చేసింది. ఇలా రెండు చిటారు కొమ్మలపై అంటూ ఇటూ జంప్ చేస్తూ చిరుతకు ఆయాసం తెప్పించేసింది. ఈ దృశ్యాలను ఓ వైల్డ్‌లైఫ్ ఫొటో‌గ్రాఫర్ వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2022-11-26T11:33:11+05:30 IST