Samantha: హాస్పిటల్‌లో సమంత.. నిజమేనా?
ABN , First Publish Date - 2022-11-24T14:29:12+05:30 IST
మళ్లీ సమంత (Samantha)కు సీరియస్‌గా ఉందా? ప్రస్తుతం ఆమె హాస్పటిల్‌లో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటుందా? లేదంటే సోషల్ మీడియాలో ఆ మెసేజ్‌లు ఏంటి? సమంత పేరు సడెన్‌గా ట్రెండింగ్‌లోకి
మళ్లీ సమంత (Samantha)కు సీరియస్‌గా ఉందా? ప్రస్తుతం ఆమె హాస్పటిల్‌లో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటుందా? లేదంటే సోషల్ మీడియాలో ఆ మెసేజ్‌లు ఏంటి? సమంత పేరు సడెన్‌గా ట్రెండింగ్‌లోకి రావడంతో.. విషయం ఏమై ఉంటుందా? అని సెర్చ్ చేస్తే.. ప్రస్తుతం ఆమె అనారోగ్యానికి గురయ్యారని, ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారనేలా వార్తలు దర్శనమిచ్చాయి. ఇటీవల తను మయోసైటిస్ (Myositis) అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా.. ట్విట్టర్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ‘యశోద’ (Yashoda) సినిమాకు సంబంధించి సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తనకున్న వ్యాధి గురించి సమంత తెలిపింది. ప్రాణాంతకం అయితే కాదు కానీ.. చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు సడెన్‌గా ఆమె హాస్పిటల్‌లో.. అనే వార్తలు చూడగానే.. సమంత అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే ఆమె మేనేజర్.. అలాంటిదేమీ లేదని తెలపడంతో.. హమ్మయ్యా అనుకుంటూ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.
‘‘ప్రస్తుతం సమంత ఇంట్లోనే ఉన్నారు. ఆమె ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఎవరు పుట్టించారో తెలియదు కానీ.. వినిపిస్తున్న వార్తలు నిజం కాదు. దయచేసి ఎవరూ కంగారు పడకండి’’ అంటూ సమంత మేనేజర్ చెప్పినట్లుగా తెలుస్తోంది. (Samantha Manager Reaction on Her Health) అయితే సమంతకు బాగాలేదని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలని చూసి.. ‘ఆమె త్వరగా కోలుకోవాలి’ అంటూ అభిమానులతో పాటు.. కొందరు సెలబ్రిటీలు కూడా ట్వీట్స్ చేయడం విశేషం. ప్రస్తుతానికైతే ఆమె చెప్పినట్లుగా వ్యాధితో బాధపడుతుంది నిజమే కానీ.. హాస్పిటల్‌లో ఉండి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారనే వార్తల్లో మాత్రం నిజం లేదనేలా సమంత మేనేజర్ స్పందించారు.